యూత్ స్టార్ నితిన్ ( Nithiin )వరుసగా ప్లాప్స్ రావడంతో రేసులో వెనుక బడిన కూడా మళ్ళీ క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. ప్రజెంట్ ఈయన చేస్తున్న ప్రాజెక్టుల్లో ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్’( Extra Ordinary Man ) అనే సినిమా ఒకటి.
ఈ సినిమాను వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తుండగా దీంతో పాటు నితిన్ మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాడు.

ఛలో, భీష్మ( Bheeshma ) వంటి రెండు సూపర్ హిట్స్ ను అందుకుని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వెంకీ కుడుములతో నితిన్ మరో ప్రాజెక్ట్ కోసం చేయి కలిపాడు.‘VNRTrio’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో నితిన్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.ఇలా రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న కూడా ఈ రోజు సైలెంట్ గా మరో ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చాడు.
ఇతడు దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్టు సింపుల్ గా ప్రకటించాడు.ఎప్పటి నుండో ఊరిస్తున్న ఈ సినిమా ఇన్ని రోజులకు అఫిషియల్ ప్రకటన వచ్చింది.
ఈయన సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేస్తూ.

ఈ సినిమాకు ”తమ్ముడు” ( THAMMUDU )అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలిపాడు.అలాగే కొన్ని సినిమాలు టైటిల్స్ చాలా బాధ్యతతో కూడుకున్నవి అని నా నెక్స్ట్ దిల్ రాజు, వేణు శ్రీరామ్ కాంబోలో చేస్తున్నా అంటూ పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసిన పిక్ షేర్ చేసాడు.అయితే తమ్ముడు అనే టైటిల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ది కావడంతో ఫ్యాన్స్ ఈయన ఎలా స్పందిస్తారో చూడాలి.
అయితే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ తో సినిమా కాబట్టి ఖచ్చితంగా మరో హిట్ గ్యారెంటీ అని నమ్మవచ్చు.







