పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ఒకవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నాడు.ఇక మరో వైపు తన లైనప్ లో ఉన్న సినిమాలను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నాడు.
మరి పవన్ లైనప్ లో ఉన్న క్రేజీ సినిమాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్‘ ( Ustaad Bhagat Singh ) ఒకటి.ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
ఎందుకంటే ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు కాబట్టి అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.పైగా ఈ కాంబో ఇప్పటికే గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ అందుకుని ఉండడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.
ప్రకటించిన కొత్తలో ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యి కేవలం ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది.ఆ చిన్న షెడ్యూల్ తోనే హరీష్ పవన్ ( Harish Shankar ) పై గ్లింప్స్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్ అంత ఇంప్రెస్ అయ్యారు.
దీంతో ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమాకు రీసెంట్ గానే పవన్ డేట్స్ ఇవ్వడంతో మళ్ళీ స్టార్ట్ అయ్యింది.ఒక షెడ్యూల్ పూర్తి అవ్వడంతో చిన్న బ్రేక్ లో ఉన్నారు.ఇక ఈ గ్యాప్ లో పవన్ మళ్ళీ బయట కూడా కనిపించలేదు.
అయితే తాజాగా ఉస్తాద్ కోసం ప్రిపేర్ చేసిన లుక్ నుండి పవర్ స్టార్ బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది.ఎందుకంటే తాజాగా పవన్ కళ్యాణ్ న్యూ లుక్ వైరల్ అయ్యింది.

మళ్ళీ పవన్ క్లీన్ షేవ్ లో కనిపిస్తున్నాడు.దీంతో ఉస్తాద్ మాత్రమే కాదు ఓజి ( OG ) సినిమాలకు కూడా మళ్ళీ బ్రేక్ ఇచ్చినట్టేనా అనే వార్తలు వస్తున్నాయి.ఎందుకంటే ఈ రెండు సినిమాల్లో కూడా ఈయన క్లీన్ షేవ్ లో కనిపించలేదు.అందుకే ఈ సినిమాలకు డేట్స్ ఇప్పట్లో ఇవ్వడా లేదంటే ఇది ఏమైనా కొత్త లుక్ నా అనేది తెలియాల్సి ఉంది.
ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఈ లుక్ కూడా వైరల్ అవుతుంది.








