టాలీవుడ్ స్టార్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు ఉన్న రేంజ్, ఫాలోయింగ్ మరే హీరోకు లేదు అనే చెప్పాలి.ఈయన చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన కూడా ఆయనకు మించిన క్రేజ్ సొంతం చేసుకున్నాడు.
ఇక ప్రజెంట్ పవన్ కళ్యాణ్ తన లైనప్ ను వరుస క్రేజీ సినిమాలతో ఫిల్ చేసాడు.మరి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాల్లో ”ఉస్తాద్ భగత్ సింగ్” (Ustaad Bhagat Singh) ఒకటి.

ఈ సినిమాను యంగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే ఈ కాంబోలో గబ్బర్ సింగ్ వచ్చింది.మరి ఇప్పుడు మరోసారి ఇదే కాంబో రిపీట్ కాబోతుంది.దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ కాంబో కోసం ఈగర్ గా వైట్ చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ తో షూట్ లో ఇటీవలే జాయిన్ అయ్యాడు.ఏప్రిల్ 5 నుండి ఈ సినిమా రెగ్యురల్ షూట్ జరుగుతుంది.

ఇప్పటికే ఈ సినిమా షూట్ నుండి ఒక పిక్ బయటకు వచ్చింది.ఇక ఇప్పుడు సెట్స్ నుండి మరో పిక్ బయటకు వచ్చి నెట్టింట వైరల్ అయ్యింది.పవన్ కళ్యాణ్ ఈ సినిమా సెట్స్ లో ఈ రోజు అభిమానులతో ఫోటోలు దిగారు.ఈ ఫొటోల్లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ కాస్ట్యూమ్స్ లో ట్రెండీ లుక్ (Pawan Kalyan’s New look) లో అదరగొడుతున్నారు.
ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా ఇప్పటికే ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడంతో భారీ హైప్ పెరగడమే కాకుండా పవర్ స్టార్ మరోసారి ఖాకీ చొక్కా వేసినట్టు తెలుస్తుంది.మరి హరీష్ పవన్ కు మరో గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇస్తాడో లేదో వేచి చూడాలి.ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అలాగే శ్రీలీల (SreeLeela) హీరోయిన్ గా నటిస్తుండగా.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.







