Radha Prasanthi: ఈ నటి కోసం వందల కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి బిల్డింగ్ పై నుంచి దూకాడట.. చివరకు?

ఈ మధ్య కాలంలో సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలు వెల్లడిస్తున్న విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.సీనియర్ నటి రాధ ప్రశాంతి( Radha Prasanthi ) తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

 Tiger Radha Prashanti Comments Goes Viral In Social Media Details Here-TeluguStop.com

గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ నటి ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.ఆమె మాట్లాడుతూ మా ఇంట్లో అందరం ఫైర్ బ్రాండ్స్ అని అన్నారు.

నేను కాలేజ్ కు బస్ లో వెళ్లేదానినని ఆ బస్ మా ఇంటి దగ్గర ఆపకపోవడం వల్ల మా పెద్దన్న ఆ బస్సును తగలబెట్టాడని ఆమె తెలిపారు.నేను నాటకాలు వేసి సినిమాల్లోకి వచ్చానని రాధా ప్రశాంతి చెప్పుకొచ్చారు.

సౌత్ లోని నాలుగు భాషలలో నటించడంతో పాటు హిందీలో కూడా ఒక సినిమాలో నటించానని ఆమె తెలిపారు.సినిమా ఇండస్ట్రీలో 12 ఏళ్లు ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు.

కిరణ్ కుమార్ రెడ్డి( Kiran Kumar Reddy ) అనే బిజినెస్ మేన్ ను పెళ్లి చేసుకున్నానని రాధా ప్రశాంతి అన్నారు.

నేను పెళ్లి చేసుకున్న వ్యక్తి పెళ్లికి ముందు నాకోసం బిల్డింగ్ పై నుంచి దూకాడని నేను పెళ్లికి నో చెప్పడంతో అలా చేశాడని ఆమె చెప్పుకొచ్చారు.ఎంతోమంది ఉన్నత స్థాయి వాళ్లు నన్ను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించారని అయితే నాకు పెళ్లిపై ఆసక్తి ఉండేది కాదని( Radha Prasanthi Marriage ) ఆమె తెలిపారు.పెళ్లైన తర్వాత నా భర్త ఒప్పుకోకపోవడంతో సినిమాలకు దూరంగా ఉన్నానని రాధా ప్రశాంతి వెల్లడించారు.

కరోనా సమయంలో ఎవరో కవాలని నా ఇల్లు తగలబెట్టారని ఆమె చెప్పుకొచ్చారు.మూడు ఫ్లోర్ల బిల్డింగ్ లో మా ఇల్లు మాత్రమే కాలిందని రాధా ప్రశాంతి చెప్పుకొచ్చారు.ఆ సమయంలో రామకృష్ణ మఠం వాళ్లు నాకు ఆశ్రయం కల్పించారని ఆమె అన్నారు.నేను ఆత్మహత్య చేసుకునేంత పిరికిదాన్ని మాత్రం కాదని ఆమె పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube