తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.
పవన్ కళ్యాణ్ తెలుగులో నటించిన కొన్ని సినిమాలె అయినప్పటికీ భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకున్నాడు.ఇది ఇలా ఉంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా గురించి మనందరికీ తెలిసిందే.
ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు ఈ సినిమా వస్తే టీవీలకు అతుక్కుని చూసే వారు ఎంతో మంది ఉన్నారు.
ఖుషి సినిమా పవన్ కళ్యాణ్ లో ఖుషి సినిమా తర్వాత ఖుషి సినిమాకు ముందు అన్న రేంజ్ లో హిట్ ని సాధించి పెట్టింది.
అంతేకాకుండా అప్పట్లో ఉన్న రికార్డ్స్ అన్నింటిని బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఖుషి సినిమా.ఇకపోతే ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే.
అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమాని మరొకసారి రీ రిలీజ్ చేస్తే చూడాలి అని లక్షలాదిమంది కోరుకుంటున్నారు.ఇక అభిమానుల కోరిక మేరకు ఈ సినిమాను డిసెంబర్ 31 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల చేయనున్నారు.
ఈ విషయం ప్రకటన చేసినప్పటి నుంచి ఖుషి సినిమా హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది.ఇకపోతే బుక్ మై షో లో అభిమానులు ప్రేక్షకులు ఈ సినిమా టికెట్స్ ని బుక్ చేసుకున్నందుకు వెతకడం మొదలు పెట్టగా అలా ఒకేసారి వేలాదిమంది బుక్ మై షోలో ఖుషి సినిమా కోసం సెర్చ్ చేయడం వల్ల అవతార్ 2 సినిమా ని కూడా వెనక్కి నెట్టి నెంబర్ వన్ స్థానంలో ట్రేడింగ్ అవడం మొదలుపెట్టింది ఖుషి సినిమా.ఈ వార్త స్పందించిన పలువురు కేవలం ప్రకటనకి ఈ రేంజ్ లో విధ్వంసం సృష్టిస్తే బుకింగ్స్ ప్రారంభమైతే ఏ విధంగా ఉంటుందో అని అనుకుంటున్నారు