పవన్ డైరెక్టర్ తో బెల్లంకొండ నెక్స్ట్ మూవీ.. అఫిషియల్ అనౌన్స్!

సాగర్ కే చంద్ర ( Saagar K Chandra ).ఈ పేరు గత కొన్నేళ్ల ముందు వరకు తక్కువ మందికి మాత్రమే తెలుసు.

 Pawan Kalyan's Director For Bellamkonda, #bss10, Chatrapathi, Saagar K Chandra,-TeluguStop.com

కానీ ఎప్పుడైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసాడో అప్పటి నుండి ఈ డైరెక్టర్ అందరికి సుపరిచితం అయ్యాడు.పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) తో భీమ్లా నాయక్ ( Bheemla Nayak ) వంటి సూపర్ హిట్ సినిమాను తీసాడు సాగర్ కే చంద్ర.

ఈ సినిమా డైరెక్ట్ చేసే ముందు వరకు ఈ డైరెక్టర్ ను అంతా మర్చిపోయారు.

కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిలిచి మరీ అవకాశం ఇవ్వడంతో ఈయన పేరు అప్పట్లో సంచలనం అయ్యింది.

అసలు ఈ డైరెక్టర్ ఎవరు అని ఆరా తీసిన వారు కూడా లేకపోలేదు.మరి పవన్ ఇచ్చిన అవకాశాన్ని సాగర్ కే చంద్ర ఉపయోగించుకుని పవర్ స్టార్ తో అద్భుతమైన సినిమాను తీసి మంచి హిట్ అయితే అందుకున్నాడు.

అయితే ఈ సినిమా తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఈ రోజు మళ్ళీ తన కొత్త సినిమా అనౌన్స్ మెంట్ చేసాడు.

ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చేస్తున్నట్టు ప్రకటన చేసారు.ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా కొత్త సినిమా అనౌన్స్ మెంట్ ఇచ్చారు.ఈ యంగ్ డైరెక్టర్ మరో యంగ్ హీరోను లైన్లో పెట్టాడు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ( Bellamkonda Srinivas ) తో తన నెక్స్ట్ మూవీ ఉందని అనౌన్స్ మెంట్ అఫిషియల్ గా వచ్చింది.బెల్లంకొండ శ్రీనివాస్ తన 10వ ( #BSS10 ) సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించ నున్నారు.

ఇక ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు.మరి ఇతర వివరాలు అతి త్వరలోనే వెల్లడి చేయనున్నారు.మొత్తానికి పవన్ డైరెక్టర్ మరో సినిమాను చేయబోతున్నాడు.మరి ఈ సినిమాతో మరో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.ఇక ప్రెజెంట్ బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి ( Chatrapathi ) రీమేక్ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా హిందీ రీమేక్ కావడంతో ఇది కనుక హిట్ అయితే ఇతడికి అక్కడ క్రేజ్ మరింత పెరగడం ఖాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube