ఓజీ ని ముగించేసి వచ్చేసిన పవన్.. ఇక ఉస్తాద్‌ వర్కౌట్స్‌

పవన్‌ కళ్యాణ్ ( Pawan kalyan )జోరు చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది.ఇలాంటి స్పీడ్ ఎప్పుడు చూడలేదు అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 Pawan Kalyan Ustad Bhagath Singh Movie Shooting Update  ,ustaad Bhagat Singh , P-TeluguStop.com

ఇండస్ట్రీలో పవన్ అడుగు పెట్టి ఇన్నాళ్లు అవుతుంది.ఇప్పటి వరకు ఇలాంటి స్పీడ్ చూడలేదు అంటున్నారు.

అంతే కాకుండా పవన్‌ కళ్యాణ్‌ యొక్క సినిమాల గురించి కూడా మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది.మొన్నటి వరకు ముంబై లో చిత్రీకరణ జరిపిన ఓజీ సినిమా షూటింగ్ కు సంబంధించి పేకప్ చెప్పారు.

ఆ తర్వాత పూణె లో ఈ సినిమా యొక్క షూటింగ్‌ ను చేయడం జరిగింది.తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ యొక్క షూటింగ్‌ లో పవన్‌ పాల్గొంటున్నాడు.

ప్రస్తుతం ఉస్తాద్‌ భగత్ సింగ్‌( Ustaad Bhagat Singh ) యొక్క కీలక సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

Telugu Harish Shankar, Pawan Kalyan, Sujeeth, Tollywood, Ustad Bhagath, Ustad-Mo

మరో వైపు రేపు ఒక భారీ ఈవెంట్ ను నిర్వహించి సినిమా గ్లిమ్స్ ను విడుదల చేయాలని నిర్ణయించారు.మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీ విషయంలో రేపు ఒక క్లారిటీ వస్తుందని అంతా నమ్మకంగా ఉన్నారు.ఓజీ సినిమా చిత్రీకరణ కోసం పవన్ కళ్యాణ్‌ రెండు వారాల పాటు కేటాయించారడి తెలుస్తోంది.

Telugu Harish Shankar, Pawan Kalyan, Sujeeth, Tollywood, Ustad Bhagath, Ustad-Mo

ఈ రెండు వారాల్లో సాధ్యం అయినంత ఎక్కువ టాకీ పార్ట్ ను ముగించాలని హరీష్ శంకర్( Harish Shankar ) ప్లాన్ చేస్తున్నాడు.ఇప్పటి వరకు సినిమా యొక్క కీలక సన్నివేశాలను మొదటి షెడ్యూల్‌ లో పూర్తి చేసిన హరీష్ శంకర్‌ ఇప్పుడు పవన్ పై మరిన్ని కీలక సన్నివేశాలు చేస్తున్నాడు.ఈ షెడ్యూల్‌ తో సినిమా యొక్క షూటింగ్ సగానికి పైగా పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి.వచ్చే ఏడాది లో సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

ఈ ఏడాదిలో పవన్‌ కళ్యాణ్ చేసిన వినోదయ్య సీతమ్ రీమేక్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.అంతే కాకుండా ఓజీ కూడా ఇదే ఏడాదిలో వస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

అది కాకుంటే హరి హర వీరమల్లు సినిమా ఈ ఏడాదిలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube