పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )హీరోగా ప్రస్తుతం నాలుగు సినిమాలు లైన్ లో ఉన్నాయి.వాటిల్లో రెండు సినిమా లు ఈ ఏడాది లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
హరి హర వీరమల్లు సినిమా( Hari Hara Veeramallu movie ) షూటింగ్ దాదాపుగా 60 శాతం చిత్రీకరణ పూర్తి అయింది అంటూ మేకర్స్ చెబుతున్నారు.మరో వైపు వినోదయ సీతమ్ సినిమా( Vinodya Seetham movie ) యొక్క రీమేక్ షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ టాకీ పార్ట్ పూర్తి అయింది అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ రెండు సినిమా లను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఈ రెండు సినిమా లు రావడం ఖాయం.

కానీ హరి హర వీరమల్లు సినిమా విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రావడం లేదు.గ్రాఫిక్స్ వర్క్ ఉండటం తో పాటు ఇంకా షూటింగ్ 40 శాతం ఉండటం వల్ల ఎంత వరకు ఈ ఏడాది లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియా లో పవన్ సినిమా ల కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తూ తెగ చర్చించుకుంటున్నారు.
పవన్ సినిమా యొక్క రెండు సినిమా లు ఈ ఏడాది లో విడుదల అయితే కచ్చితంగా గొప్ప విషయం.ఈ రెండు సినిమా లు మాత్రమే కాకుండా సాహో సుజీత్ దర్శకత్వంలో ఓజీ అనే సినిమా ను చేస్తున్నాడు.
హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా ను కూడా చేస్తున్న విషయం తెల్సిందే.మొత్తానికి పవన్ నాలుగు సినిమా ల్లో ఈ ఏడాది రెండు సినిమా లు రావాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
ప్రస్తుతం ఢిల్లీ లో ఉన్న పవన్ కళ్యాణ్ అక్కడ రాజకీయం చక్కబెడుతున్నాడు.తిరిగి వచ్చిన తర్వాత సినిమా చిత్రీకరణ లో పాల్గొంటాడు అంటూ సమాచారం అందుతోంది.







