ఎడారిలో మంచు ( Snow in desert )వర్షమా అని ఆశ్చర్య పోతున్నారా? మీరే కాదు, అక్కడ శాస్త్రవేత్తలు కూడా అవాక్కవుతున్న పరిస్థితి.ఎక్కడ, ఏమిటి అన్న పరిస్థితి తెలుసుకోవాలంటే ఈ పూర్తి కధనం చదివి తీరాల్సిందే.
మన ఈ విశాల భూ ప్రపంచంలో అనేక వింతలూ, విశేషాలు చోటుచేసుకునే ఉంటాయి.ఇక సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచమొక కుగ్రామం అయిపోయింది.
ఈ క్రమంలో ప్రపంచంలోని వివిధ మూలల్లో జరిగిన వింత సంఘటనల గురించి కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం.

సాధారణంగా ఎడారులు అనగానే మన మదిలో ఒక్కటే స్ఫురణకు వస్తుంది.ఇసుక, ఒక్క చెట్టు గాని, పుట్టగాని, నీరుగాని లేని ప్రాంతం అని.మరి అలాంటి ప్రాంతంలో మంచు వర్షమంటే ఎవరికి నమ్మబుద్ధవుతుంది? కానీ నమ్మి తీరాల్సిందే.ఉత్తర అమెరికాలోని( North America ) ఎడారుల్లో ఐతే వేసవిలో వర్షాలు పడతాయి.అయితే చాలా దశాబ్దాల తర్వాత అక్కడ మంచు కురుస్తోంది.అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారగా నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ఇక వాటిని చూసిన అక్కడి శాస్త్రవేత్తలు కూడా మిక్కిలి ఆశ్చర్యపోతున్నారు.

ఉత్తర అమెరికాలోని సోనోరన్ ఎడారి వాయువ్య మెక్సికన్( Sonoran Desert is northwestern Mexico ) రాష్ట్రాలైన బాజా కాలిఫోర్నియా, సోనోరా, బాజా కాలిఫోర్నియా సుర్, అలాగే నైరుతి యునైటెడ్ స్టేట్స్ కొంత భాగంలో విస్తరించి ఉంది.దీని వైశాల్యం 260,000 చదరపు కిలోమీటర్లు.వేసవి కాలంలో ఉష్ణోగ్రత 48 డిగ్రీల సెల్సియస్‌కు వరకు ఇక్కడ చేరుకుంటుంది.ఇక్కడ ఎక్కడ చూసినా కనుచూపు మేర ఇసుక మాత్రమే కనిపిస్తుంది.ఇక అక్కడ ఒక్క బొట్టు నీరు చుక్క కూడా కనిపించదు.దాంతో అక్కడ ఎవరూ నివసించడానికి సాహసం చేయలేరు.
అయితే కొద్ది రోజుల క్రితమే ఇలాంటి ఎడారిలో మంచు కురిసింది.ఈ చారిత్రక దృశ్యాన్ని ల్యాండ్‌స్కేప్ ఫోటోగ్రాఫర్ జాక్ డైకింగా కూడా తన కెమెరాలో బంధించారు.
ఈ రకంగా ఈ విషయం బయటకు తెలిసింది.







