పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan kalyan ) టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ ”ఓజి”.ఇప్పటికే ఈ సినిమా 50 శాతానికి పైగానే షూట్ పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ అఫిషియల్ గానే తెలిపాడు.
మొన్నటి వరకు పవన్ వారాహి యాత్ర( Varahi yatra )లో ఉండడంతో ఈయన లేని పోర్షన్ ను పూర్తి చేసారు.ఇక ప్రజెంట్ మళ్ళీ పవన్ కళ్యాణ్ షూట్ లో జాయిన్ అయ్యాడు.

దీంతో శరవేగంగా షూట్ స్టార్ట్ అయ్యింది.ఈ సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా భారీ అంచనాలను పెట్టుకున్నారు.ఎందుకంటే పవన్ కూడా అన్నిటికంటే లాస్ట్ ప్రకటించిన ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపిస్తూ ముందు పూర్తి చేస్తున్నాడు.ఇక ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తి అవుతుండడంతో ఈ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ కే రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నట్టు టాక్.
ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కానుకగా అదిరిపోయే అప్డేట్ రానుంది అని తాజాగా సినీ ఇండస్ట్రీ వర్గాల్లో బజ్ వైరల్ అయ్యింది.మేకర్స్ నాన్ స్టాప్ గా కంప్లీట్ చేస్తున్న ఈ భారీ సినిమా టీజర్ ను పవన్ పుట్టిన రోజు కానుకగా సెప్టెంబర్ 2న రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారట.

మరి ఇదే నిజమైతే ఇది బిగ్గెస్ట్ ట్రీట్ గా నిలిచి పోతుంది.మరి దీనిపై క్లారిటీ తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్( Priyanka Arul Mohan ) హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.
డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.మరి సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.







