Pawan Kalyan : డీజే టిల్లు సినిమాలో సిద్దు లాంటి పాత్రను పవన్ కళ్యాణ్ కూడా చేశాడు… ఏంటది ? 

ప్రస్తుతం టాలీవుడ్ యువతకి పిచ్చి ట్రెండ్ ఏదైనా ఉంది అంటే అది డిజె టిల్లు సినిమా( DJ Tillu ) మాత్రమే.టిల్లు గాడు సినిమా ఏ ముహూర్తాన వచ్చిందో ఆ సినిమాకి చాలామంది ఫ్యాన్స్ వచ్చారు అలాగే ఆ సినిమాలో నటించిన హీరో సిద్దూకి కూడా అదే రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

 Pawan Kalyan Similar Role Like Dj Tillu-TeluguStop.com

టిల్లు గాడు టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు.అయితే ఇప్పుడంటే ఇలా కుర్ర హీరోల హవా నడుస్తుంది కానీ కొంచెం వెనక్కి వెళితే పవన్ కళ్యాణ్ హవా ఇంతకన్నా ఎక్కువగా కనిపించేది.

పవనిజం అనే పేరుతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్( Pawan Kalyan ) సృష్టించేవారు.ఆయన సినిమా విడుదలవుతుంది అంటే చాలు థియేటర్లు ధ్వంసం అయిపోయేవి.

సినిమా థియేటర్లలో జనాల కన్నా ఎక్కువగా పవర్ స్టార్ కటౌట్స్ ఉండేవి.అంత వీరాభిమానులు ఉన్నారు ఆయనకి.

Telugu Dj Tillu, Gudumba Shanka, Meera Jasmine, Pawan Kalyan, Role, Veera Shanka

మరి డిజె టిల్లు లాంటి పోలికలు కలిగిన పాత్ర పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కూడా తన కెరియర్ లో చేశాడు.ఆ పాత్ర ఏంటి ? పవన్ కళ్యాణ్ చేసిన సినిమా ఏంటి ? అనే విషయాన్ని ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.పవన్ కళ్యాణ్ సైతం డి జే టి లు తరహాలోనే వేషధారణలో భయంకరమైన మార్పులు చేర్పులు చేసి ఒక సినిమా తీశాడు అదే గుడుంబా శంకర్.టిల్లు సినిమాలో సిద్దు పాత్ర ఎలా ఉంటుందో గుడుంబా శంకర్ లో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా అలాగే ఉంటుంది.

డబల్ పాంట్స్ వేసి మాస్ ఆడియన్స్ పల్స్ పట్టుకుని యాక్షన్ సన్నివేశాల్లో గుడుంబా శంకర్( Gudumba Shanka ) చిత్రంలో ఇరగదీసాడు పవన్ కళ్యాణ్.

Telugu Dj Tillu, Gudumba Shanka, Meera Jasmine, Pawan Kalyan, Role, Veera Shanka

ఈ చిత్రంలో పాటలు కూడా అద్భుతంగా ఉండేవి మీరాజాస్మిన్ హీరోయిన్ గా నటించిన గుడుంబా శంకర్ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ టాక్ సొంతం చేసుకున్న ఆ పవన్ కళ్యాణ్ మేనరిజం కి యువత పిచ్చెక్కిపోయేవారు అప్పట్లో.వీర శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అంజనా ప్రొడక్షన్స్ పై నాగబాబు నిర్మించగా మణిశర్మ సంగీతం అందించాడు.2004 విడుదలైన గుడుంబా శంకర్ సినిమాలో పవన్ కళ్యాణ్ ప్యాంటు పైన ప్యాంటు వేయడం అప్పట్లో పెద్ద ట్రెండు.దీనిని చాలామంది ఫాలో అయ్యేవారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube