వారాహి విజయాత్ర తొలి బహిరంగ సభ కత్తిపూడిలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి.తనను కక్షగట్టి అసెంబ్లీలోకి రాకుండా 2019 ఎన్నికల్లో ఓడించినట్లు వ్యాఖ్యానించారు.ఇక ఇదే సమయంలో వైసీపీ అధినేత సీఎం జగన్ పై( CM Jagan ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత.జనసేన( Janasena ) ఓడిపోయాక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించారు.దాంతో ఆ రోజున మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేశాను.ఆరోజున ముఖ్యమంత్రికి ఫోనులో ఒకటే చెప్పాను… చాలా పద్ధతి గల ప్రతిపక్షంగా ఉంటాం.

మీ పర్సనల్ విషయాలు జోలికి రాకుండా.ఏదైనా విధానపరమైన నిర్ణయాలపై విమర్శించాల్సి వస్తే మాత్రం విమర్శిస్తాం.మీ వైపు నుంచి తప్పులు లేకుండా చూసుకోండి అని చెప్పాను.151 మంది ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో ఎంపీలు వచ్చారంటూ మనస్పూర్తిగా అభినందనలు తెలియజేసి ఎంతో సహృదయాతతో మాట్లాడటం జరిగింది.ఈ క్రమంలో భవన నిర్మాణ కార్మికుల సమస్య గురించి ఎప్పుడైతే మాట్లాడానో… అప్పటి నుండి నాపై వైసీపీ వాళ్లు కక్షగట్టి… తిట్టని రోజంటూ లేదు.
నాతోపాటు ఇంట్లో ఉన్న పిల్లలను కూడా విమర్శించారు.అంత నీచంగా వైసీపీ వాళ్లు విమర్శించారు.నాకు వైసీపీ వాళ్ళ పర్సనల్ విషయాలు తెలియక కాదు.

వైసీపీ వాళ్ళకి ఇంటెలిజెన్స్ కావాలి.నాకు నా అభిమానులు చాలు.2014లో ఇదే రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు నన్ను విమర్శిస్తే అతని గురించి ఓ కుర్రోడు పెన్ డ్రైవ్ తీసుకువచ్చి వీడియోలు చూపించాడు.కానీ వాటిని చూసి నాకు మనస్కరించలేదు… నా సంస్కారం ఒప్పుకోలేదు.పాలసీ మీద పోరాడాలి తప్ప వ్యక్తిగత విషయాలపై మాట్లాడుకూడదని భావించి ఆ కుర్రాడిని పంపించేశాను.దేశంలోనే అత్యధికమైన పారితోషకం అందుకుంటున్న హీరోలలో నేను ఒకరిని.ఇన్ని విమర్శలు నేను ఎందుకు ఎదుర్కొంటున్నానంటే ప్రజల కోసం.
ఎంతోమందిని స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చాను అని పవన్ కళ్యాణ్ భావోద్వేగంగా వారాహి కత్తిపూడి తొలి బహిరంగ సభలో ప్రసంగించారు.







