పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యంత క్రేజ్ తో వస్తున్న చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్.బాక్సాఫీస్ ని ఓ ఊపు ఊపిన గబ్బర్ సింగ్ బ్రాండ్ తో వస్తుండటం, దాదాపు ముడేళ్ళ తరువాత పవన్ కళ్యాణ్ హీరోగా కనిపించనుండటం, పవర్ స్టార్ తన కేరీర్ ని త్వరలోనే ముగిస్తానని చెప్పడం, ఈ చిత్రాన్ని అభిమానులకి అంకితం ఇవ్వడం .
ఇలా చెప్పుకుంటే పోతే కర్ణుడి చావు కన్నా ఎక్కువ కారణాలే ఉన్నాయి సర్దార్ గబ్బర్ సింగ్ మీద ఓ రేంజ్ అంచనాలు ఉండటానికి.
శ్రీమంతుడు కన్నా చాలా పెద్ద రిలీజ్, శ్రీమంతుడు కన్నా ఎక్కువ బెనిఫిట్ షోలు, చివరకి మహేష్ బాబు కంచుకోట ఓవర్సిస్ లో మహేష్ చిత్రాల కన్నా చాలా పెద్ద రీలిజ్ ప్లాన్ చేశారు సర్దార్ కి.యావరేజ్ టాక్ వచ్చినా, శ్రీమంతుడు మొదటిరోజు రికార్డులన్ని గల్లంతే.ఎందుకంటే టికేట్ రేట్లు కూడా భారిగా పెంచేస్తున్నారు.
పైగా సెలవురోజున విడుదల అవుతోంది.అందుకే మహేష్ అభిమానులు భయపడిపోతున్నారు.
ఈస్ట్ లాంటి ట్రేడ్ ఏరియాలో అయితే శ్రీమంతుడు ఏం ఖర్మా, బాహుబలి మొదటిరోజు రికార్డు ని కూడా సర్దార్ కొట్టేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో సర్దార్ భారి తేడాతో శ్రీమంతుడు ఓపెనింగ్స్ ని దాటేస్తుంది.
ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ తేడా మరీ ఎక్కువగా కనిపిస్తుందో లేదో చూడాలి.