యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇటీవల ‘నేను శైలజ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ సినిమా పర్వాలేదు అనిపించుకుంది.
ప్రస్తుతం రామ్ తన కొత్త సినిమాను షురూ చేసే పనిలో ఉన్నాడు.గత మూడు నాలుగు నెలల నుండి ఏ దర్శకుడికి ఓకే చెప్పాలా అని ఆలోచిస్తూ తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నాడు.
తనకు సూపర్ హిట్ ఇచ్చిన ‘కందిరీగ’ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌తో మరో సినిమా చేయాలని రామ్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.ఇటీవల వీరిద్దరి మద్య చర్చలు కూడా జరిగాయి అంటూ సినీ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది
‘కందిరీగ’ చిత్రం సక్సెస్ తర్వాత సంతోష్ శ్రీనివాస్ తన రెండవ సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో తెరకెక్కించాడు.
‘రభస’గా తెరకెక్కిన ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో రెండు సంవత్సరాలుగా ఈయనతో సినిమాలు చేసేందుకు ఏ ఒక్క హీరో ముందుకు రావడం లేదు.
దాంతో ఈయన కథలు పట్టుకుని ప్రతి ఒక్క హీరో చుట్టు తిరిగాడు.చివరకు రామ్ ఈయనకు ఓకే చెప్పి ఈయన దర్శకత్వంలో నటించేందుకు సిద్దం అయ్యాడు.
రామ్ పలువురు దర్శకులతో వర్క్ చేయాలనుకున్నా వారు వేరే ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు, ఈయన వద్దకు వచ్చే దర్శకులు పెద్దగా నచ్చడం లేదు.దాంతో రామ్‌కు ఎటు చూసినా కూడా సంతోష్ శ్రీనివాస్ కనిపించాడు.
దాంతో చేసేది లేక ‘కందిరీగ’ కాంబోను రిపీట్ చేయాలని నిర్ణయించుకున్నాడు.







