Janasena Pawan Kalyan : ఆ తప్పే ఇప్పుడు కూడా చేస్తున్న పవన్.. పాలిటిక్స్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ రైట్ కాదంటూ?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Janasena Pawan Kalyan ) పిఠాపురంలో లక్ష మెజారిటీతో గెలుస్తానని కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.వైసీపీ ఎంత డబ్బు పంచినా తనదే విజయమని పవన్ చెబుతున్నారు.

 Pawan Kalyan Repeats Same Mistake In Politics Details Here-TeluguStop.com

పిఠాపురంలో 90 వేల మంది కాపు ఓటర్లు ఉండటంతో పవన్ కళ్యాణ్ ఈ కామెంట్లు చేస్తున్నారని సమాచారం అందుతోంది.అయితే గత ఎన్నికల్లో చేసిన తప్పులే పవన్ ఇప్పుడు కూడా చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

పాలిటిక్స్ లో ఓవర్ కాన్ఫిడెన్స్( Over Confidence ) ఎప్పుడూ రైట్ కాదంటూ విశ్లేషకులు చెబుతున్నారు.గెలవక ముందే మెజారిటీ అంటూ ప్రగల్భాలు పలకడం వల్ల ఏ కారణం చేతనైనా ఓడిపోతే తీవ్రస్థాయిలో విమర్శలను మూటగట్టుకోవాల్సి ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu Janasena, Confidence, Pawan Fans, Pawan Kalyan, Pawankalyan, Pithapuram,

పవన్ జనసేన తరపున పోటీ చేసే పూర్తిస్థాయి అభ్యర్థుల జాబితాను ప్రకటించాల్సి ఉంది. పిఠాపురం( Pithapuram ) నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి వంగా గీత కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి అనే సంగతి తెలిసిందే.ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి గెలవాలనే ఆలోచనతోనే పోటీ చేస్తారు.ఎన్నికల్లో గెలవాలంటే ప్రతి ఓటు కీలకమే.ఎన్నికల్లో గెలుపు నాదే అంటూ మెజారిటీతో సహా పవన్ చేస్తున్న కామెంట్ల వల్ల కొన్నిసార్లు న్యూట్రల్ ఓటర్లు( Neutral Voters ) సైతం దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.వైసీపీ వ్యూహాలు ఆ పార్టీకి ఉన్నాయని ఆ పార్టీని తక్కువగా అంచనా వేయొద్దని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Janasena, Confidence, Pawan Fans, Pawan Kalyan, Pawankalyan, Pithapuram,

పవన్ పొలిటికల్ భవిష్యత్తుకు చెక్ పెట్టే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వైసీపీ( YCP ) వదులుకోదు.2014లో వైసీపీ అధికారంలోకి రాకపోవడానికి పవన్ కారణమనే భావన ఆ పార్టీలో ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ గాజు గ్లాస్ డైలాగ్( Ustaad Bhagat Singh Glass Dialogue ) పవన్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగించినా ఈ డైలాగ్ పై వైసీపీ నేతలు ట్రోల్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube