పవన్ కల్యాణ్ కెరీర్ లో రీమేక్ హిట్స్ ఇవే !

పవన్ కళ్యాణ్ ని ఈరోజు ఇండస్ట్రీలో మనం స్టార్ హీరోగా చూస్తున్నాం అంటే దానికి ముఖ్య కారణం ఆయన ఎక్కువగా రీమేక్ లను నమ్ముకోవడమే.అత్యధిక రీమిక్స్ సినిమాల్లో నటించిన రికార్డు కూడా పవన్ కళ్యాణ్ కి సొంతం.

 Pawan Kalyan Remake Movies ,pawan Kalyan , Remakes , Tollywood, Bheemlanayak, T-TeluguStop.com

ఎక్కువ రీమేక్ సినిమాలను తెలుగులో తనదైన రీతిలో రూపొందించి ఈ బ్లాక్ వాసు హిట్స్ అందుకున్నాడు.తన మొదటి సినిమా మొదలు గత చిత్రం బీమ్ల నాయక్ వరకు చాలా సినిమాలు రీమేకులే కావడం గమనార్హం.అలా పవన్ నటించి హిట్టు కొట్టిన ఆ రీమిక్స్ సినిమాలు ఏంటో చూద్దాం.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

Telugu Bheemlanayak, Gabbar Singh, Gopala Gopla, Katama Raidu, Kushi, Pawan Kaly

పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి బాలీవుడ్ లో ఆమీర్ ఖాన్ తీసిన ఖయామత్ సే బయామత్ తక్ చిత్రాన్ని తెలుగులో దర్శకుడు ఈవీవీ తెరకెక్కించగా ఇది యావరేజ్ సినిమాగా నిలిచింది.

గోకులంలో సీత

ఇక పవన్ రెండవ సినిమా గోకులంలో సీత కూడా రీమేక్ సినిమానే.తమిళ భాషలో హీరో కార్తీక్ నటించిన గోకులతిల్ సీతై అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

సుస్వాగతం

Telugu Bheemlanayak, Gabbar Singh, Gopala Gopla, Katama Raidu, Kushi, Pawan Kaly

పవన్ కళ్యాణ్ నటించిన మూడవ సినిమా సైతం రీమేక్ చిత్రమే.తమిళ్లో హీరో విజయ్ తీసిన లవ్ టుడే అనే చిత్రాన్ని తెలుగులో భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ రీమేక్ గా నటించగా ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది.

తమ్ముడు

జీ జోతా నహీ సికందర్ అనే హిందీ సినిమా ని బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తెరకెక్కించగా అదే చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేశాడు.ఈ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో చెప్పాల్సిన అవసరం లేదు.

ఖుషి

Telugu Bheemlanayak, Gabbar Singh, Gopala Gopla, Katama Raidu, Kushi, Pawan Kaly

తమిళంలో ఎస్ జె సూర్య దర్శకత్వంలో వచ్చిన సినిమా ఖుషి.దీన్ని తెలుగులో అదే పేరుతో సూర్య దర్శకత్వంలోనే రీమేక్ గా విడుదల చేయగా పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే అత్యద్భుతమైన సినిమాగా రికార్డ్ విజయాన్ని సాధించింది.

అన్నవరం, తీన్ మార్, గోపాల గోపాల

తమిళ సినిమా తిరుపాదిగా చిత్రాన్ని తెలుగులో అన్నవరం గా పవన్ కళ్యాణ్ రీమేక్ చేయగా ఇది యావరేజ్ సినిమాగా నిలిచింది.ఇక సైఫ్ అలీఖాన్ లవ్ ఆజ్ కల్ అనే పేరుతో తీసిన చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ విడుదల తీన్ మార్ గా చేయగా అది ఫ్లాప్ అయింది.ఇక అక్షయ్ కుమార్, పరేష్ రావల్ కలిసి నటించిన చిత్రాన్ని తెలుగులో గోపాల గోపాల అనే పేరుతో వెంకటేష్, పవన్ కళ్యాణ్ హీరోలు గా విడుదల చేయగా ఈ చిత్రం కూడా యావరేజ్ సినిమాగా నిలిచింది.

గబ్బర్ సింగ్

బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమాని పవన్ కళ్యాణ్ తెలుగులో గబ్బర్ సింగ్ పేరుతో రీమేక్ చేయగా ఇది తెలుగు సినిమా రికార్డుల దుమ్ము దులిపింది.

కాటమ రాయుడు

తమిళంలో దీదం అనే పేరుతో అజిత్ హీరోగా విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా కాటమరాయుడు అనే పేరుతో రీమేక్ చేయగా ఈ చిత్రం పరాజయం పాలయింది.

వకీల్ సాబ్

బాలీవుడ్ లో అమితాబచ్చన్ నటించిన పింక్ అనే సినిమాని తెలుగులో వకీల్ సాబ్ అనే పేరుతో రీమెక్ చేయగా ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.

భీమ్లా నాయక్

Telugu Bheemlanayak, Gabbar Singh, Gopala Gopla, Katama Raidu, Kushi, Pawan Kaly

మలయాళం లో అయ్యప్పయుం కోషియం అనే చిత్రాన్ని తెలుగులో భీమ్లా నాయక్ అనే పేరు తో పవన్ కళ్యాణ్ హీరో గా రీమేక్ చేయగా ఇది ఒక సూపర్ హిట్ సినిమా అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube