ఆ మహిళ ఆవేదనని ఏపీ ప్రభుత్వం వినాలి అంటున్న జనసేనాని

లాక్ డౌన్ నేపథ్యంలో సామాన్యులు పడుతున్న కష్టాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందిస్తున్నారు.

ఇప్పటికే తమిళనాడులో ఇరుక్కున్న మత్స్యకారుల గురించి అక్కడి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసి వారిని ఆదుకునేలా చేసిన పవన్ తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ట్విట్టర్ లో పోస్ట్ పెట్టి అక్కడ వలస కూలీలని రక్షించాలని విన్నవించారు.

దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కూడా సానుకూలంగా స్పందించి కూలీలని ఆడుకున్నారు.మరో వైపు కూలి చేసుకునే బ్రతికే సామాన్యులు పడుతున్న ఇబ్బందులని ఏపీ ప్రభుత్వం పట్టించుకోవాలని జనసేనాని జగన్ కి కూడా విజ్ఞప్తి చేసారు.

అయితే ఈ విషయాన్ని వైసీపీ నేతలు రాజకీయం చేసి పవన్ కళ్యాణ్ మీద విమర్శల దాడి చేస్తున్నారు.ఈ నేపధ్యంలో మరో సారి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో పోస్ట్ చేసి ఏపీ ప్రభుత్వం సామాన్యుల కష్టాలు వినాలని కోరారు.

తాము పడుతున్న ఇబ్బందుల గురించి ఓ నెల క్రితం బిడ్డను ప్రసవించిన ఓ మహిళ ఓ వీడియోలో తెలిపింది.కర్నూలు జిల్లాలో పని చేసుకునేందుకు వచ్చానని, లాక్ డౌన్ కారణంగా తన ఇంట్లో వాళ్లు బయటకెళ్లి పనులు చేయలేని పరిస్థితి రావడంతో తినేందుకు తిండి కూడా లేదంటూ ఓ మహిళ తన ఆవేదనను వ్యక్తం చేస్తున్న వీడియోను జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు.

Advertisement

ఈ విషయమై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టి ఇలాంటి వారి కష్టాలు పరిష్కరించాలని కోరారు.మరి దీనిపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది వేచి చూడాలి.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..
Advertisement

తాజా వార్తలు