స్థానిక ఎన్నికలపై జనసేనలో ఊపు ఎక్కడ! మీటింగ్ లకి పరిమితమా

మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా బీజేపీతో పొత్తు పెట్టుకొని రాజకీయ ప్రయాణం సాగిస్తున్నారు.

ఇది ఎంత వరకు పవన్ కళ్యాణ్ కి అనుకూలిస్తుందో తెలియదు కాని రెండు పార్టీలు మాత్రం ఎదుగుతామని చాలా బలంగా నమ్ముతున్నాయి.

అయితే ఈ రెండు పార్టీలకి, మరీ ముఖ్యంగా జనసేన పార్టీ గత ఎన్నికలలో ప్రధాన ఓటమికి కారణం గ్రామీణ స్థాయిలో బలమైన క్యాడర్ లేకపోవడమే అనే మాట రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.పవన్ కళ్యాణ్ కి ఎంత చరిష్మా ఉన్నా దానిని, ఆయన సిద్ధాంతాలకి క్రింది స్థాయికి తీసుకెళ్ళే శక్తి క్రింది స్థాయి క్యాడర్ కే ఉంటుందని చెబుతున్నారు.

అయితే ఈ విషయంలో క్యాడర్ ని బిల్డ్ చేసుకోవడం పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడని, అందుకే అతని మీద అభిమానం ఉండి ప్రజలు ఓట్లు వేసిన గెలిచే స్థాయిలో సామర్ధ్యం నిరూపించుకోలేకపోయాడని చెబుతున్నారు.అయితే త్వరలో ఏపీలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు జనసేన పార్టీ క్యాడర్ నిర్మించుకోవడానికి మంచి అవకాశం.

అయితే పవన్ కళ్యాణ్ పద్ధతి చూస్తుంటే ఈ అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకునేలా ఉన్నాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఎంత సేపు హైదరాబాద్ లో ఉంటూ నియోజకవర్గం నేతలతో మీటింగ్ లు పెట్టడం తప్ప స్థానికంగా గ్రామీణ స్థాయి నుంచి పార్టీని సంస్థాగత నిర్మాణం జరిపే విధంగా ఆలోచన చేయడం లేదనే మాట వినిపిస్తుంది.

Advertisement

పవన్ కళ్యాణ్ ఏమీ చెప్పడం లేదు కాబట్టి తాము ఏమీ చేయలేము అన్నట్లు నియోజకవర్గ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ పంథాలోనే వెళ్తున్నారు.మరి ఇదే విధానంలో సాగితే జనసేన పార్టీ ఎన్ని సంవత్సరాలు అయిన ఏపీలో మూడో ప్రత్యామ్నాయంగా మారడం కల్ల అని రాజకీయ విశ్లేషకులు అనేస్తున్నారు.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు