పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న ఓజీ సినిమా లో( OG Movie ) స్పెషల్ సాంగ్ ఒకటి ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.పవన్ సినిమాలో ఇలాంటి సాంగ్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి.
గ్యాంగ్ స్టర్ నేపథ్య కథతో వస్తున్న ఓజీ సినిమా లో స్పెషల్ సాంగ్( Special Song ) కోసం భారీ స్కెచ్ వేశారట.ఈ సాంగ్ కోసం బాలీవుడ్ భామని దించే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ తర్వాత నిర్మాత దనయ్య సినిమా క్వాలిటీగా వచ్చేందుకు బడ్జెట్ విషయంలో అసలు వెనక్కి తగ్గట్లేదని టాక్.

పవర్ స్టార్ OG సినిమా స్పెషల్ సాంగ్ కూడా ఆ రేంజ్ కి తగినట్టుగానే ఉంటుందని తెలుస్తుంది.పవన్ ఓజీ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ భామ ఊర్వశి( Urvashi Rautela ) కానీ, దిశా పటాని( Disha Patani ) కానీ చేసే ఛాన్స్ ఉందట.ఇదే కాకుండా మరో హీరోయిన్ పేరు కూడా డిస్కషన్స్ లో ఉంది.
మొత్తానికి పవన్ ఓజీని సుజిత్ ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్లాన్ చేస్తున్నారు.సుజిత్ కూడా పవన్ అభిమానే అవడంతో ఆయన అభిమాని ఎలా చూడాలని అనుకుంటాడో అలా చూపిస్తారని తెలుస్తుంది.
పవన్ ఓజీ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారన్న విషయం తెలిసిందే.







