పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో భారీ క్రేజ్ ఉన్న మూవీ ఏది అంటే ”ఓజి”( OG Movie ) అనే చెప్పాలి.ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.
యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ మిగిలిన అన్ని సినిమాల కంటే వేగంగా షూట్ జరుపుకుంది.

మొదటి 50 శాతం షూటింగ్ చాలా ఫాస్ట్ గా పూర్తి కాగా ఆ తర్వాత పవన్ రాజకీయ టూర్( Pawan Political Tour ) నేపథ్యంలో వాయిదా పడింది.ఇక ఈ సినిమా అప్పుడు గ్యాప్ వచ్చినప్పటికీ సుజీత్( Director Sujith ) మిగిలిన భాగం షూట్ పూర్తి చేసాడు.ఇక తాజాగా మరో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది.
ఈ రోజు నుండి బ్యాంకాక్ లో ఈ సినిమా షూట్ స్టార్ట్ అయినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.
అంతేకాదు ఈ సినిమా షూట్ స్టార్ట్ చేసి 60 రోజులు అవుతున్నట్టు సినిమా డీఓపీ రవి చంద్రన్ తెలిపారు.
దీంతో 60వ రోజు ఓజి షూట్( OG Movie Shooting ) స్టార్ట్ అయ్యింది అనే చెప్పాలి.ఇక ఈ సినిమా నుండి ఇటీవలే పవన్ బర్త్ డే కానుకగా అదిరిపోయే రేంజ్ లో టీజర్ రిలీజ్ చేసి సుజీత్ పవన్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చారు.
ఈ టీజర్ బాగా ఆకట్టుకుంది.ముంబై గ్యాంగ్ స్టర్ గా పవన్ లుక్, స్టైల్ అంతా కూడా ఆకట్టుకోగా ఈ సినిమాపై అంచనాలు మరిన్ని పెరిగాయి.

ఇక ఈ సినిమాలో ప్రియాంక మోహన్( Priyanka Mohan ) హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.మరి ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లో కానీ లేదంటే వచ్చే ఏడాది కానీ రిలీజ్ అయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటుంది.







