పవన్ కళ్యాణ్( Pawan kalyan ) వచ్చే నెలలో బ్రో సినిమా( BRO Movie ) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ సముద్ర ఖని దర్శకత్వం( Directed by Samudra Khani ) లో రూపొందిన బ్రో సినిమా విడుదల అయిన కొన్ని వారాల గ్యాప్ లోనే ఓజీ సినిమా( OG Movie ) తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు పవన్ కళ్యాణ్ సిద్దం అవుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ యొక్క ఓజీ సినిమా షూటింగ్ కార్యక్రమాలను జులై వరకు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఓజీ సినిమా ను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
ఈ మధ్యే మొదలు పెట్టినా కూడా ఎక్కువ శాతం ఈ సినిమా కు పవన్ డేట్లు ఇచ్చాడు.ఇప్పుడు కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
వారాహి యాత్ర కు పవన్ సిద్ధం అవుతున్న విషయం తెల్సిందే.
మొదటి దశ వారాహి యాత్ర పూర్తి అయిన తర్వాత మళ్లీ ఓజీ సినిమా షూటింగ్ కు డేట్లు ఇవ్వడం జరిగిందట.అలా సినిమా ను చాలా స్పీడ్ గా ముగించి ఇదే ఏడాది లో విడుదల చేయాలని భావిస్తున్నారు.మరో వైపు ఎప్పుడో మొదలు పెట్టిన హరి హర వీరమల్లు సినిమా మాత్రం ఇప్పటి వరకు షూటింగ్ ముగించుకోలేదు.
కనీసం ఈ ఏడాది లో వస్తుందా అంటే అనుమానమే అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఒక వైపు వరుసగా సినిమా లు చేస్తున్న పవన్ కళ్యాణ్ ఎందుకు హరి హర వీరమల్లు సినిమా ను మాత్రం పూర్తి చేయడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
పవన్ బ్రో సినిమా సూపర్ హిట్ అయితే తప్పకుండా ఓజీ సినిమా కి మంచి బజ్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.