నితిన్‌ పెళ్లికి పవన్‌ హాజరు అవుతాడా? లేదా?

పవన్‌ కళ్యాణ్‌ కు నితిన్‌ వీరాభిమాని అనే విషయం అందరికి తెల్సిందే.హీరోగా తనకంటూ అభిమానులను సంపాదించుకున్న నితిన్‌ ఇంకా పవన్‌ ను అభిమానిస్తూనే ఉంటాడు.

పవన్‌ సినిమాలపై సాదారణ అభిమానుల మాదిరి ఆసక్తి చూపించడం పవన్‌ ను కలిస్తే ఎంతో ఉత్సాహంతో ఫొటోలు తీసుకోవడం వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం చేస్తూ ఉంటాడు.ఈనెల 26న ఉన్న తన పెళ్లికి ప్రత్యేక అతిథిగా సీఎం కేసీఆర్‌తో పాటు పవన్‌ కళ్యాణ్‌ను కూడా నితిన్‌ ప్రత్యేకంగా ఆహ్వానించాడు.

నితిన్‌ అంటే కూడా పవన్‌కు ప్రత్యేకమైన అభిమానం ఉంది.గతంలో పలు సార్లు నితిన్‌ సినిమా వేడుకల్లో పవన్‌ పాల్గొన్నాడు.

నితిన్‌ హీరోగా పవన్‌ ఒక సినిమాను కూడా నిర్మించాడు.కనుక ఖచ్చితంగా నితిన్‌ పెళ్లికి పవన్‌ హాజరు అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.

Advertisement

సాదారణ పరిస్థితుల్లో నితిన్‌ పెళ్లికి పవన్‌ హాజరు అవుతాడా లేదా అనే ప్రశ్నే వచ్చేది కాదు.కాని ప్రస్తుతం కరోనా కారణంగా పరిస్థితులు వేరుగా ఉన్నాయి.

ఈ పరిస్థితుల్లో వేడుకలు నిర్వహించడం పూర్తిగా బ్యాన్‌ చేయాలనుకున్నా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అయితే కార్యక్రమాలు నిర్వహించుకోవాలంటూ సూచనలు చేశారు.కనుక నితిన్‌ పెళ్లికి రెండు వైపుల కలిపి 60 నుండి 70 మంది వరకు మాత్రమే హాజరు అయ్యే అవకాశం ఉంది.అది కూడా చాలా పెద్ద సంఖ్యే.

కరోనా విపరీతంగా పెరుగుతున్న ఈ సమయంలో అడుగు బయట పెట్టాలంటే కాస్త ఇబ్బందిగా ఉంది.కనుక పవన్‌ పెళ్లికి హాజరు అయ్యే విషయమై 26వ తారీకు వరకు క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

సూర్య తో మల్టీ స్టారర్ సినిమా చేయనున్న మరో స్టార్ హీరో...
Advertisement

తాజా వార్తలు