నాగబాబు కి క్లారిటీ వచ్చేసింది ? పవన్ కి ఎప్పుడు ?

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకు వెళితే వర్కౌట్ అవుతుందనే విషయం జనసేన నాయకుడు, పవన్ సోదరుడు నాగబాబుకి స్పష్టమైన క్లారిటీ వచ్చేసినట్టు గా కనిపిస్తోంది.2019 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందిన తరువాత జనసేన ను అసలు సిసలైన రాజకీయ పార్టీగా ముందుకు తీసుకువెళ్లకపోతే కష్టమనే అభిప్రాయం నాగబాబు లో వ్యక్తమవుతోంది.

పవన్ కు అశేషమైన క్రేజ్, అభిమానులు, సామాజికవర్గం అండదండలు ఇలా అన్నీ ఉన్నా, ఘోరంగా ఓటమి చెందడానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ అని, ఆ పార్టీతో మొదటి నుంచి సఖ్యతగా ఉంటూ, ఆ పార్టీ చేసిన తప్పిదాలను ప్రశ్నించకుండా మౌనంగా ఉండిపోవడం వంటి వాటి కారణంగా టిడిపి జనసేన ఒకే తాను లో ముక్కలని, జనాల్లో అభిప్రాయం ఏర్పడడం, ఇవన్నీ జనసేన కు చేటు తెచ్చే అంశాలుగా నాగబాబు కి క్లారిటీ వచ్చేసినట్టుగా కనిపిస్తోంది.

అందుకే పార్టీ అనుమతి లేకుండా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.వచ్చే ఎన్నికల నాటికి జనసేన కు అవకాశం దక్కాలంటే.టిడిపి పతనం అవ్వాల్సిందే అని నాగబాబు కోరుకుంటున్నట్టు కనిపిస్తోంది.

కొద్దిరోజులుగా ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే ఇదే అర్థమవుతుంది.అసలు ఏపీలో వైసీపీ, జనసేన, బీజేపీ తప్ప తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉందని నాగబాబు ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని, ఆయన గట్టిగా వాదిస్తున్నారు.అమరావతి పేరుతో పెద్ద ఎత్తున భూ కుంభకోణాలకు అప్పటి తెలుగుదేశం పార్టీ పాల్పడిందని నాగబాబు పదేపదే చెబుతున్నారు.

Advertisement

ఇక టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్న నాయుడు అరెస్ట్ వ్యవహారంపైనా నాగబాబు స్పందించారు.ఆయన అరెస్టు ను సమర్థించారు.

కానీ జనసేన పార్టీ తరఫున ఆ పార్టీ నాయకులు ఖండించారు.ఒకవైపు పవన్ టిడిపిని తీవ్రంగా విమర్శిస్తూ వెళ్తుంటే జనసేన మాత్రం తెలుగుదేశానికి ఆగ్రహం కలగకుండా, ఆ పార్టీతో తాము సఖ్యతగా ఉన్నాము అనే సంకేతాలు పంపిస్తోంది.పవన్ మాత్రం చంద్రబాబు మంచి నాయకుడిని, ఆయనను అకారణంగా వైసిపి ఇబ్బంది పెడుతోంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండగా, నాగబాబు మాత్రం గత టీడీపీ ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయని, ఇప్పుడు దానికి సంబంధించి అరెస్టులు జరుగుతున్నాయని, వాటిని స్వాగతిస్తున్నామని చెబుతున్నారు.

ఈ ఇద్దరి మధ్య పొంతన ఇప్పుడు కనిపించడంలేదు.తెలుగుదేశం పార్టీ ఇప్పటి నుంచే తెలుగుదేశం పార్టీపైనా విమర్శలు చేస్తూ వెళ్లకపోతే, జనసేన కు అవకాశం ఉండదని, జనసేనకు ఓటు వేసినా, టిడిపికి ఓటు వేసినా ఒకటే అనే అభిప్రాయం జనాల్లో వచ్చేస్తుందని నాగబాబు అసలు ఆవేదనగా కనిపిస్తోంది.

మరి పవన్ నాగబాబు బాట పడతాడో లేదో చూడాలి.

అవే టార్గెట్ గా నేడు చంద్రబాబు ఢిల్లీ టూర్
Advertisement

తాజా వార్తలు