కాటమరాయుడు ఇన్ సైడ్ టాక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు మరోకొన్ని రోజుల్లో ఉగాది కానుకగా తెలుగు ప్రేక్షకులని అలరించటానికి రానుంది.

కిషోర్ పార్థసాని (డాలి) దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో అజిత్ నటించిన వీరమ్ అనే చిత్రానికి రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

ఒరిజినల్ చిత్రంలో తమన్నా పోషించిన పాత్రను ఇందులో శృతిహాసన్ పోషిస్తుండగా, శివబాలాజీ ఓ ప్రధాన పాత్రలో కనిపిస్తాడు.కాటమరాయుడు శరత్ మరార్ నిర్మాణంలో తెరకెక్కింది.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన టాక్ విషయానికి వస్తే, సినిమా యావరేజ్ గా వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.పవర్ స్టార్ మెనరిజమ్స్, ట్రైన్ ఫైట్ మాస్ ప్రేక్షకులని విపరీతంగా అలరించం ఖాయం.

శృతి ఈ సినిమాలో చాలా అందంగా కనిపిస్తుండటంతో యువత థియేటర్ల ముందు వాలిపోతుంది.ఫ్యామిలి ఆడియెన్స్ కి కావాల్సిన ఆంశాలు కూడా ఉండటం, పల్లె వాతావరణం ఉన్న సినిమా కావడం, ఉగాది సీజన్, వేసవి సెలవులు, పోటీలో పెద్ద సినిమాలు లేకపోవడం, ఈ ఆంశాలన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే కాటమరాయుడు బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అనిపిస్తోంది.

Advertisement

కథ, కథనాల మీద సినిమా యావరేజ్ అయినా, ఓ పెద్ద హీరో సినిమా సెలవుల్లో వస్తోంటే, అంతకన్నా ఇంకేం కావాలి.గత ఏడాది వేసవి సెలవుల్లో వచ్చిన సరైనోడు కూడా యావరేజ్ టాక్ తోనే భారి కలెక్షన్లు సాధించింది.

అందుకే, కాటమరాయుడుపై పంపిణీదారులు బాగా ఆశలు పెట్టుకున్నారు.మేం చెప్పిన యావరేజ్ టాక్ నిజమైతే, ఈ సినిమా ఎంత లేదన్నా 75-85 కోట్ల దాకా షేర్ వసూళ్ళు సాధించవచ్చు.

కాని, బిజినెస్ పరంగా ఈ సినిమా లాభాల్లో పడాలంటే, అంతకుమించి సంపాదించాలి.

వయస్సు 93 , 107 మంది భార్యలు... 185 మంది సంతానం... ఆయన అంతమందిని పెళ్లి ఎందుకు చేసుకున్నాడో తెలుసా
Advertisement

తాజా వార్తలు