కుదిరితే పాదయాత్ర లేకపోతే బస్సు యాత్ర ఏదో ఒకటి చేసి జనాల్లో పలుకుబడి పెంచుకోవడమే ప్రధాన ధ్యేయంగా వివిధ పార్టీల అధినేతలు , ముఖ్య నేతలు భావిస్తూ ఉంటారు.అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ యాత్రలు ఈ మధ్య కాలంలో పెరిగిపోయాయి.
జనసేన కళ్యాణ్ సైతం యాత్ర చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు.అయితే పాదయాత్ర చేపట్టాలా.
బస్సు యాత్ర చేయాలా అనే విషయంలో తేల్చుకోలేకపోతున్నారు.సాధారణ ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉండటంతో జనసేన పార్టీ బలం పెరిగే విధంగా చేయాలనేది పవన్ కళ్యాణ్ అభిప్రాయం.2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర నిర్వహించారు. నిత్యం జనాల్లో తిరుగుతూ, వైసీపీ గ్రాఫ్ పెరిగేలా చేశారు.
నాయకుల్లో ఉత్సాహం పెంచడంతో పాటు వైసిపి పై జనాల్లో ఆదరణ పెరిగేలా చేయగలిగారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబు ఇలా అందరూ యాత్ర ద్వారానే అధికారంలోకి రాగలిగారు.
దీంతో పవన్ కూడా పాదయాత్ర చేపట్టేందుకు మొగ్గు చూపిస్తుండగా, దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి .నిన్న విశాఖ లో పర్యటించిన జనసేన కీలక నాయకుడు నాగబాబు సైతం పవన్ కళ్యాణ్ ఏదో ఒక యాత్ర చేపడతాడ అంటూ హింట్ ఇవ్వడంతో, పవన్ కళ్యాణ్ చేపట్టబోయే యాత్ర పై అందరికీ ఆసక్తి పెరిగిపోయింది.

అయితే పవన్ పాదయాత్ర చేపట్టడం అసాధ్యమని, ఆయన యాత్ర చేపడితే అభిమానులను కంట్రోల్ చేయడం సాధ్యం అయ్యే పని కాదని, ఎంత మంది పోలీసులు ఉన్న ఎంతగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా ఆయన్ను చూసేందుకు అభిమానులు వేలాది , లక్షలాదిగా వస్తారని, అనవసర తలనొప్పులు పెరిగిపోతాయని జనసేన వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.ఈ నేపథ్యంలో గతంలో సీనియర్ ఎన్టీఆర్ చైతన్య రథం ద్వారా ఏ విధంగా అయితే రాష్ట్రమంతటా యాత్ర చేపట్టారో అదే మాదిరిగా జనసేనాని సైతం ప్రత్యేకంగా ఒక బస్సు యాత్ర చేపట్టి జనాల్లోకి వెళ్ళాలని ప్లాన్ లో ఉన్నారట.దీనిపై మరికొద్ది రోజుల్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.








