జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భీమవరం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్( Grandhi Srinivas ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.పవన్ కల్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
రాజకీయ నేతకు ఉండాల్సిన విలువలు పవన్ కల్యాణ్ లేవని గ్రంథి శ్రీనివాస్ పేర్కొన్నారు.భీమవరం గురించి జనసేనానికి ఏం తెలుసని ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ అజ్ఞానంతో మాట్లాడుతున్నారో.? పిచ్చి పట్టి మాట్లాడుతున్నారో? అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.రంగులు మార్చే ఊసరవెల్లి తరహాలో పవన్ కల్యాణ్( Pawan Kalyan ) గంట గంటకూ మాటలు మార్చుతారని విమర్శించారు.

ఈ పరిస్థితుల్లో పవన్ ఆరోగ్యంపై ఆందోళనగా ఉందన్నారు.గతంలో చిరంజీవి( Chiranjeevi ) ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ కు అమ్మి కేంద్రమంత్రి పదవి పొందారన్నారు.ఈ క్రమంలోనే వీరి మనస్థత్వం చూస్తే పైసల కోసం ఏమైనా చేస్తారని అర్థం అవుతుందని పేర్కొన్నారు.
యుద్ధం చేస్తున్నానని చెప్పే పవన్ కల్యాణ్ ప్రజల కోసం ఎప్పుడూ పోరాడారో చెప్పాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా తన రాజకీయ చరిత్రలో పవన్ వంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదని చెప్పారు.
ఏపీ రాజకీయాల్లో గందరగోళానికి జనసేనే కారణమని ఆరోపించారు.







