అనుకోని అందమైన అనుభూతి... పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్!

సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు వివిధ రకాల సోషల్ మీడియా ఖాతాల ద్వారా పెద్ద ఎత్తున అభిమానులకు దగ్గరవుతూ భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుని ఉంటారు.ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ఇప్పటివరకు ట్విట్టర్ ఖాతాలో మాత్రమే అకౌంట్ చేశారు.

 Pawan Kalyan Interesting Post On Police Dog Goes Viral , Pawan Kalyan, Police Do-TeluguStop.com

అయితే ఇందులో కూడా ఎప్పుడు ఈయన రాజకీయాలకు సంబంధించిన విషయాలను మాత్రమే అభిమానులతో పంచుకుంటారు.ఇలా ట్విట్టర్లో మాత్రమే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ లోకి కూడా అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఇంస్టాగ్రామ్ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఈయనకు మిలియన్ సంఖ్యలో ఫాలోవర్స్ పెరిగిపోయారు.

ఇక ఇంస్టాగ్రామ్ లోకి అడుగు పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ తరచూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎలాంటి పోస్టులు చేయకపోయినా అప్పుడప్పుడు తన రాజకీయాలకు సంబంధించినటువంటి పోస్టులు పెడుతూ ఉంటారు.ఇదిలా ఉండగా తాజాగా ఈయన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఈ పోస్టులో భాగంగా పవన్ కళ్యాణ్ కుక్క ( Dog ) గురించి పోస్ట్ చేస్తూ షేర్ చేశారు.

బేగంపేట ఎయిర్ పోర్ట్ లో ఓ పోలీస్ కుక్కతో పవన్ సరదాగా ఉన్న వీడియోని షేర్ చేస్తూ.నేను బేగంపేట ఎయిర్ పోర్ట్ లో నా ఫ్లైట్ ఎక్కేందుకు ఎదురుచూస్తుండగా నా కోసం సర్ప్రైజ్ విజిటర్ వచ్చారు అంటూ పోస్ట్ చేశారు.

ఎయిర్ పోర్టులో నాకోసం వచ్చినటువంటి స్పెషల్ విజిటర్ మరెవరో కాదు ఎవరో కాదు పోలీస్ డాగ్( Police Dog ) స్క్వాడ్ లో ఉండే బిందు(కుక్క).అది నాతో చాలా స్నేహంగా ఉంది.తన తోకని ఆసక్తిగా ఊపింది.తను నాలో ఉత్సాహం నింపింది.నేను విమానం ఎక్కేముందు ఓ అనుకోని అందమైన అనుభూతిని ఇచ్చింది అంటూ ఆసక్తికరంగా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారడమే కాకుండా ఈయన ఎయిర్పోర్టులో ఆ డాగ్ తో ఆడుకుంటూ ఉన్నటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన సినిమాలను కాస్త పక్కన పెట్టి రాష్ట్ర రాజకీయాల( politics ) పై ఫోకస్ చేశారని తెలుస్తుంది.అలాగే ఏపీలో కూడా కొన్ని నెలలలో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పూర్తి దృష్టిని రాజకీయాలపైనే పెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube