విశాఖలోనే పవన్ కళ్యాణ్.. ఎయిర్ పోర్ట్ మూసివేత..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )శుక్రవారం విశాఖ పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే.

విశాఖ హార్బర్ లో( Visakha Harbour ) కొద్ది రోజుల క్రితం బోట్లు దగ్ధమైన కుటుంబాలకు 50 వేల ఆర్థిక సహాయం అందించారు.

అనంతరం ఈ కార్యక్రమం ముగించుకుని తిరిగి హైదరాబాద్ బయలుదేరాల్సిన పవన్ కళ్యాణ్ శుక్రవారం విశాఖలోనే బస చేయనున్నారట.కారణం చూస్తే రన్ వే రీసర్ఫేసింగ్ కారణంగా ఎయిర్ పోర్ట్ మూసివేశారు.

దీంతో పవన్ విశాఖలోనే ఆగిపోయారు.రేపు ఉదయం తిరిగి హైదరాబాద్ కి బయలుదేరనున్నారు.

ఇదిలా ఉంటే హైదరాబాదు నుండి విశాఖకు ప్రత్యేక విమానం ద్వారా రావాల్సిన సమయంలో ఆ విమానాన్ని కొంతమంది ఉన్నతాధికారులు వెనక్కి పంపించేసినట్లు పవన్ సభలో ఆరోపించారు.విశాఖపట్నంకి వస్తున్న ప్రతిసారి వైసీపీ ప్రభుత్వం తనని ఇబ్బందులు పాలు చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

విశాఖ హార్బర్ లో జరిగిన సభలో వైసీపీ ప్రభుత్వం( YCP ) పై పవన్ సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఇదే సమయంలో మత్స్యకారులకు అనేక హామీలు ఇచ్చారు.

ఇది రూపాయి బిళ్ళ ప్రభుత్వం.మరో నాలుగు నెలలు ఓపిక పటండి "జనసేన తెలుగుదేశం" సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని పవన్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు