టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటులలో శ్రీరామ్ ( sriram )ఒకరు కాగా ప్రస్తుతం ఈ నటుడు తమిళ సినిమాలలో ఎక్కువగా నటిస్తున్నారు.శ్రీరామ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మేనేజర్ల విషయంలో చిరాకు వచ్చి మేనేజర్లు వద్దని నేను అనుకున్నానని శ్రీరామ్ వెల్లడించారు.
నేను మంచి నటుడు అని మాత్రమే నాకు ఛాన్స్ ఇచ్చారని శ్రీరామ్ పేర్కొన్నారు.

కిక్ సినిమా( Kick movie )ను మొదట నాకు చెప్పారని సినిమాలో శ్యామ్ పాత్రలో నేను నటించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.కానీ ఆ సినిమాలో నా రోల్ చెప్పిన విధంగా ఉండదేమో అని ఫీలై రిజెక్ట్ చేశానని శ్రీరామ్ కామెంట్లు చేశారు.నిప్పు సినిమాలో రవితేజ( Ravi Teja )పై ఉన్న అభిమానంతో నటించానని శ్రీరామ్ పేర్కొన్నారు.
నాలో అప్పటికీ ఇప్పటికీ ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గలేదని శ్రీరామ్ కామెంట్లు చేశారు.

నేను పెద్ద డైరెక్టర్, చిన్న డైరెక్టర్ అనే తేడా తెలియదని ఆయన వెల్లడించారు.డైరెక్టర్ మంచి ప్రీ ప్రొడక్షన్ చేస్తే మంచి రిజల్ట్ చేస్తే బాగుంటుందని శ్రీరామ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.నేను కెరీర్ పరంగా ఎన్నో ప్రయోగాలు చేశానని ఆ ప్రయోగాలు వర్కౌట్ అయ్యి ఉంటే బాగుండేదని శ్రీరామ్ అన్నారు.
బ్యాగ్రౌండ్ లేకున్నా రవితేజ సక్సెస్ అయ్యారని శ్రీరామ్ కామెంట్లు చేశారు.ఒక అడవికి వెళ్లామంటే అక్కడ అన్ని జంతువులు ఉంటాయని శ్రీరామ్ కామెంట్లు చేశారు.శ్రీరామ్ కెరీర్ పరంగా మళ్లీ బిజీ అవుతుండగా ఆయనకు ఎలాంటి ఫలితాలు దక్కుతాయో చూడాల్సి ఉంది.శ్రీరామ్ కెరీర్ ప్లానింగ్ బాగుందని రాబోయే రోజుల్లో మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లు దక్కాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మంచి కథలకు మాత్రమే నటుడు శ్రీరామ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని సమాచారం అందుతోంది.







