పవన్ కళ్యాణ్ హీరోగా బ్యాక్ టు బ్యాక్ వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ సినిమా లు విడుదల అయ్యి మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.ఏడాది గ్యాప్ లో రెండు భారీ విజయాలను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ నుండి హ్యాట్రిక్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు.ఆయన మాత్రం సినిమా విడుదల ఎప్పుడో క్లారిటీ ఇవ్వడం లేదు.
షూటింగ్ ముగింపు దశకు వచ్చిందనే విషయం క్లారిటీ ఇచ్చారు.కాని సినిమా విడుదల ఎప్పుడు అనే విషయం మాత్రం స్పష్టతను ఇవ్వడం లేదు.వచ్చే ఏడాది సంక్రాంతికి హరి హర వీరమల్లు అంటూ వార్తలు వస్తున్నాయి.కాని అది నిజం కాకపోవచ్చు అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే హరి హర వీరమల్లు కాకుండా సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలు విడుదలకు ఉన్నాయి.
ఇప్పటికే అవి సంక్రాంతికి కర్చీఫ్ వేసి ఉన్నాయి.

కనుక ఖచ్చితంగా హరి హర వీరమల్లు సినిమా సంక్రాంతికి వచ్చే అవకాశం కనిపించడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించిన హడావుడి పెద్ద ఎత్తున వస్తుంది.అయినా కూడా ఇప్పటి వరకు పవన్ హరి హర వీరమల్లు సినిమా గురించిన క్లారిటీ ఇవ్వలేదు.అసలు ఎప్పుడు ఈ సినిమా ను విడుదల చేస్తారో తెలియజేయాలి అంటూ పవన్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఫ్యాన్స్ ఏం జరుగుతుందో తెలియక గందరగోళంలో ఉంటే.పవన్ మాత్రం ఇంకా మౌనంగా ఉన్నాడు.
హరి హర వీరమల్లు కాకుండా మరో రెండు డబ్బింగ్ సినిమాలను కూడా పవన్ చేస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమాలకు సంబంధించిన అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.







