టాలీవుడ్ లో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందుంటారని చెప్పొచ్చు.ఆయన ఫ్యాన్స్ ఆయన్ని దేవుడిగా భావిస్తారు.
ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ తో సినిమా ఎలా ఉన్నా సరే పవర్ స్టార్ సినిమాలు ఫస్ట్ డే రికార్డులు క్రియేట్ చేస్తాయి.పవన్ ఫ్లాప్ సినిమాల ఫస్ట్ డే రికార్డ్ కూడా ఇప్పటికి చాలా హీరోల హిట్ సినిమాలు కొట్టలేదని చెప్పొచ్చు.
అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేత మొట్టమొదటిసారి తొడ కొట్టించాడు డైరక్టర్ క్రిష్.ఓ విధంగా చెప్పాలంటే హరి హర అప్డేట్ కోసం ఇన్నాళ్లు వెయిట్ చేసి విసిగి పోయిన పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చాడు క్రిష్.
ఇక సినిమాలో పవర్ స్టార్ రోల్ ని చూపిస్తూ రిలీజ్ చేసిన పవర్ గ్లాన్స్ గురించి అయితే చెప్పడానికి మాటల్లేవు.ఖచ్చితంగా ఈ సినిమా అనుకున్న విధంగా ఉంటే మాత్రం మరోసారి టాలీవుడ్ బాక్సాఫీస్ పై పవన్ కళ్యాణ్ విధ్వంసం చూస్తామని చెప్పొచ్చు.క్రిష్ ఈ సినిమాని చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.2023 సంక్రాంతికి హరి హర బరిలో దిగుతున్నాడు.మరి టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులని సైతం ఈ సినిమా కొల్లగొడుతుందా లేదా అన్నది చూడాలి.







