బడా ప్రొడ్యూసర్ కు 1200 ల ఎకరాలు... కాస్ట్లీగిఫ్ట్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్?

సినీ నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) జనసేన పార్టీని( Janasena Party )  ను స్థాపించి రాజకీయాలలోకి అడుగు పెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకొని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు.

ఇక ఈయన ఎన్నికలలో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎంతో మంది సినిమా సెలబ్రెటీలు పవన్ కళ్యాణ్ కు పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేశారు.

ఇక కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్( TG Vishwa Prasad ) ఘనంగా పార్టీ కూడా ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ( People Media Factory ) అధినేతగా టీజీ విశ్వప్రసాద్ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించి ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.ఈ క్రమంలోనే తాజాగా టీజీ విశ్వప్రసాద్ కోసం పవన్ కళ్యాణ్ అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది.టీజీ విశ్వప్రసాద్ నిర్వహించే వ్యాపారాలలో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొని భాగస్వామ్యం అయ్యారని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాలోని( Kurnool District ) ఓర్వకల్లు సమీపంలో వేలకోట్ల విలువచేసే 1200 ఎకరాల భూమిని టీజీ విశ్వప్రసాద్ కోసం ఇచ్చినట్టు తెలుస్తోంది.

Advertisement

ఇలా పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్ టిజి విశ్వప్రసాద్ కోసం ఈ స్థాయిలో భూమిని ఇప్పించారనే విషయం అటు ఇండస్ట్రీలోనూ ఇటు రాజకీయాల పరంగా చర్చలకు కారణమవుతుంది.మరి పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశంతో ఇలాంటి ఒప్పందానికి సిద్ధమయ్యారనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇక టీజీ విశ్వప్రసాద్ పీపుల్స్ మీడియా బ్యానర్లో పవన్ కళ్యాణ్ ఎన్నో సినిమాలు చేసిన సంగతి మనకు తెలిసిందే చివరిగా ఈ బ్యానర్ లో పవన్ కళ్యాణ బ్రో అనే సినిమా చేశారు.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు