నేషనల్ అవార్డు గెలిచినందుకు అల్లు అర్జున్ కి ఖరీదైన బహుమతి ఇచ్చిన పవన్ కళ్యాణ్!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మొట్టమొదటి నేషనల్ అవార్డు( National Award) ని గెలుచుకున్న ఏకైక హీరో గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గానే చరిత్ర సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే.మన ఇండస్ట్రీ లో ఎన్టీఆర్ కాలం నుండి మెగాస్టార్ చిరంజీవి కాలం వరకు ఎంతో మంది లెజెండ్స్ ఉన్నారు.కానీ వాళ్ళెవ్వరికీ దక్కని ఈ అదృష్టం అల్లు అర్జున్ కి దక్కింది అంటే చిన్న విషయం కాదు.‘పుష్ప’( pushpa ) సినిమా తో ఆయన సృష్టించిన ప్రభంజనం అలాంటిది.స్టోరీ యావేరేజి గా ఉన్నప్పటికీ అల్లు అర్జున్( Allu Arjun ) తన అద్భుతమైన నటన మరియు యూనిక్ స్వాగ్ తో మరో లెవెల్ కి తీసుకెళ్లాడు ఈ చిత్రాన్ని.అందుకే ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన మ్యానరిజమ్స్ ని ప్రపంచం మొత్తం ఫాలో అయ్యింది.

 Pawan Kalyan Gave An Expensive Gift To Allu Arjun For Winning The National Award-TeluguStop.com

ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ, అల్లు అర్జున్ మేనియా లో మునిగి తేలారు.

Telugu Allu Arjun, Gift, National Award, Pawan Kalyan, Pawankalyan-Movie

అల్లు అర్జున్ సాధించిన ఈ ఘనత కి యావత్తు సినీ లోకం సంబరాల్లో మునిగి తేలింది.అల్లు అర్జున్ తోటి హీరోలతో పాటుగా, రాజకీయ నాయకులు కూడా ఆయనని ప్రశంసల వర్షం తో ముంచి ఎత్తారు.ఇక అల్లు అర్జున్ సొంత కుటుంబ సభ్యులైన మెగా ఫ్యామిలీ కి ఎంత ఆనందం గా ఉంది ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

చిరంజీవి , రామ్ చరణ్ మరియు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) వంటి వారు మనస్ఫూర్తిగా సోషల్ మీడియా నుండి శుభాకాంక్షలు తెలియచేసారు.ఇక చిరంజీవి అయితే అల్లు అర్జున్ ని నేరుగా తన ఇంటికి పిలిపించుకొని కేక్ కట్ చేయించి అభినందనలు తెలిపాడు.

చిరంజీవి కి రీసెంట్ గానే మోకాళ్ళ సర్జరీ జరిగింది, అందుకే బయటకి కడలిని పరిస్థితి కాబట్టే అల్లు అర్జున్ ని తన ఇంటికి పిలిపించుకున్నాడు.ఇక అల్లు అర్జున్ చిన్న మామ పవన్ కళ్యాణ్ కూడా అల్లు అర్జున్ కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియచేసాడు.

Telugu Allu Arjun, Gift, National Award, Pawan Kalyan, Pawankalyan-Movie

ఒక బొకే ద్వారా అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు తెలియచేసిన పవన్ కళ్యాణ్, ఒక విలువైన బహుమతిని కూడా ఇచ్చాడట.ప్రత్యేకంగా హ్యాండ్ వర్క్ తో చేయించిన ఒక ఆర్ట్ ని అల్లు అర్జున్ రూపం లో చేయించి, దానిని బహుమతిగా పంపించాడట.ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.దీని గురించి అల్లు అర్జున్ ఇప్పటి వరకు ఎలాంటి పోస్ట్ కానీ, ఇంస్టాగ్రామ్ స్టోరీ కానీ పెట్టలేదు కానీ, విశ్వసనీయ వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం అయితే ఆయన ఈ బహుమతి పంపాడని తెలుస్తుంది.

అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి థాంక్స్ చెప్తూ ఎప్పుడు పోస్టు పెడుతాడా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube