నందమూరి అభిమానులు మొత్తం బాలయ్య బాబు( Balayya Babu ) కుమారుడు నందమూరి మోక్షజ్ఞ తేజ( Nandamuri Mokshajna Teja ) ఎంట్రీ కోసం ఎంతో కాలం నుండి ఎదురు చూస్తూనే ఉన్నారు.కానీ ఆయన ఎంట్రీ మాత్రం ఇవ్వడం లేదు.
ఒకానొక దశలో మోక్షజ్ఞ లుక్స్ చూసి ఇతనికి సినిమాల్లోకి వచ్చే ఆసక్తి అసలు లేదేమో అని అనుకున్నారు.కానీ బాలయ్య మాత్రం కచ్చితంగా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది , కాస్త సమయం కావాలి అని అన్నాడు.
ఆయన అలా చెప్పిన చాలా ఏళ్లకు కూడా మోక్షజ్ఞ మొదటి సినిమా గురించి ఎలాంటి ప్రకటన రాలేదు.కానీ రీసెంట్ గానే బాలయ్య బాబు వచ్చే ఏడాది, అనగా 2024 వ సంవత్సరం లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అని అధికారికంగా చెప్పడం తో నందమూరి అభిమానులు పండగ చేసుకున్నారు.
అయితే మొదటి సినిమా కి డైరెక్టర్ ఎవరు , హీరోయిన్ ఎవరు, ఎలాంటి జానర్ చెయ్యబోతున్నాడు అనేది అభిమానుల్లో మెలిగే ప్రశ్న.

మొదటి సినిమాలో హీరోయిన్ శ్రీలీల( Srilila ) అనేది మాత్రం ఫిక్స్.డైరెక్టర్ అనిల్ రావిపూడి( Director Anil Ravipudi ) అని కొంతమంది, లేదు బోయపాటి శ్రీను అని మరికొంత మంది చెప్తూ వచ్చారు.కానీ వీళ్ళెవరూ కాకుండా ‘వకీల్ సాబ్’ డైరెక్టర్ వేణు శ్రీరామ్ రీసెంట్ గానే బాలయ్య బాబు ని కలిసి మోక్షజ్ఞ కోసం ఒక స్టోరీ ని వినిపించాడట.
బాలయ్య బాబు కి కథ నచ్చింది, వేణు శ్రీ రామ్ పవన్ కళ్యాణ్ తో పని చేసాడు కాబట్టి, కథ వినిపించిన వెంటనే పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి వేణు శ్రీరామ్ పని తనం గురించి అడిగి తెలుసుకున్నాడట బాలయ్య బాబు.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మంచి టాలెంటెడ్ డైరెక్టర్, అతనితో పని చేసినప్పుడు చాలా కంఫర్ట్ గా అనిపించింది అని చెప్పాడట.
పవన్ కళ్యాణ్ ఆ మాట చెప్పడం తో బాలయ్య బాబు వేణు శ్రీ రామ్ సబ్జెక్టు ని లాక్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

వేణు శ్రీరామ్ ప్రస్తుతం యంగ్ హీరో నితిన్ తో ‘తమ్ముడు’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినా వెంటనే మోక్షజ్ఞ సినిమా చేసే అవకాశం ఉంది.ఇప్పటి వరకు వేణు శ్రీరామ్ మూడు సినిమాలు చేస్తే, మూడు కూడా మంచి హిట్స్ గా నిలిచాయి.
కేవలం దిల్ రాజు నిర్మాణ సంస్థలో మాత్రమే పని చేస్తూ వచ్చిన వేణు శ్రీరామ్, మోక్షజ్ఞ చిత్రం కూడా ఆయన బ్యానర్ లోనే చేస్తాడేమో చూడాలి.బాలయ్య కొడుకు కాబట్టి మాస్ రోల్ లో అభిమానులు ఊహించొచ్చు, కానీ వేణు శ్రీరామ్ ఒక యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లో మోక్షజ్ఞ ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడట.