జూనియ‌ర్ తో భేటీపై ప‌వ‌న్ ఫ్యాన్స్ గుస్స‌..!

బీజేపీ అగ్ర నేత అమిత్ షా.జూనియ‌ర్ ఎన్టీఆర్ భేటీ తెలుగు రాష్ట్రాల్లో ఆస‌క్తిని రేపుతోంది.

అలాగే ప‌లు పార్టీల‌ను టెన్ష‌న్ పెడుతోంది.ఇక టీడీపీ అభిమానులు ఒక‌లా అంటుంటే.

ఇటు ప‌వ‌న్ ఫ్యాన్స్ మ‌రోలా అంటున్నారు.ఈ కీల‌క భేటీపై ఎన్నో క‌థ‌నాలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

అయితే ఇద్దరి భేటీపై జనసేన నాయకులు.పవన్ ఫ్యాన్స్.

Advertisement
Pawan Kalyan Fans Not Happy With Jr Ntr Amti Sha Meeting Details, Amith Shah, NT

ఫైర్ అవుతున్నారు.దీనికి కార‌ణం లేక‌పోలేదు.ప్రస్తుతం బీజేపీతో జ‌న‌సేన పొత్తులో ఉంది.2019 ఓటమి తర్వాత.బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్.

ఆ పార్టీతో కలిసి ముందుకు సాగుతున్నారు.ఇప్పటి వరకు ఏపీలో ఉన్న బీజేపీకి బలమైన మిత్రపక్షం జ‌న‌సేన మాత్ర‌మే.

అయితే ఇప్పుడు మ‌రో వాద‌న వినిపిస్తోంది.ఏంటంటే బీజేపీ అధిష్టానం స‌హా కీలక నేత‌లు.

పవన్ విషయంలో అనుసరిస్తున్న వైఖరి ఏమాత్రం బాగాలేద‌ని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు.బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

ఇప్పటి వరకు పవన్ మోడీ క‌లిసిందే లేదు.ఇక అమిత్ షాతో ఒకే ఒకసారి అది కూడా.

Advertisement

పొత్తు పెట్టుకున్న రెండేళ్ల తర్వాత భేటీ అయ్యారు.ఇక ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వచ్చారు.

ఈ సందర్భం గా అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి చిరంజీవిని ఆహ్వానించారు.

అయితే లాస్ట్ మినిట్ లో మాత్రం ప‌వ‌న్ని ఆహ్వానించారు.దీంతో ఆయ‌న ఎలాగూ రాలేద‌నుకోండి.

ఈ క్రమంలో బీజేపీతో జనసేన సంబంధాలపై.విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలావుంటే.ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ కావడం జనసేనలో మరింత ఆగ్రహావేశాలు వచ్చేలా చేస్తున్నాయ‌ని అంటున్నారు.

అయితే మ‌రో విష‌యం ఏంటంటే జూనియర్ తో షా భేటీ వెనుక ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ మూవీనే ఉందని.ఆ సినిమాతో ఆయన ఇంప్రస్ అయిన షా పిలిచార‌ని అంటున్నారు.అయితే ఈ పరిణామాలపై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

సొంత కూటమి పార్టీ అయిన జనసేనకు మోడీ.అమిత్ షా ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదని రగిలిపోతున్నారు.

బీజేపీ చెప్పిందే వాస్తవం అయితే ఆర్ఆర్ఆర్ సినిమాతో షా ముగ్ధులై ఉంటే ఇందులో అల్లూరి పాత్ర‌ధారి రామ్ చరణ్ తో కూడా భేటీ కావాలి క‌దా.దర్శక ధీరుడు రాజమౌళిని కూడా పిలిచి ఉండాల్సింది కదా.అలా ఎందుకు జ‌ర‌గ‌లేదు.సినిమా ప‌రంగా అయితే చ‌ర‌ణ్ ని ఎందుకు పిల‌వ‌లేద‌ని కూడా మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

తాజా వార్తలు