నాకు జబర్దస్త్ నుంచి పేరు రాలేదు.. చలాకీ చంటి షాకింగ్ కామెంట్స్ వైరల్!

జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న వాళ్లలో చలాకీ చంటి ఒకరు.గత కొన్ని రోజులుగా చలాకీ చంటి బిగ్ బాస్ షో సీజన్6 లోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరగగా చంటి సైతం ఆ ప్రచారం నిజమేననే విధంగా సంకేతాలు ఇచ్చారు.

 Chalaki Chanti Shocking Comments About Jabardasth Show Goes Viral Details, Chala-TeluguStop.com

సెప్టెంబర్ 4వ తేదీ నుంచి బిగ్ బాస్ షో ప్రసారం కానుండగా చలాకీ చంటి బిగ్ బాస్ షోలో ఏ రేంజ్ లో సందడి చేస్తారో చూడాల్సి ఉంది.

తాజాగా చలాకి చంటి జబర్దస్త్ షో గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

జబర్దస్త్ షో నుంచి నాకు పేరు రాలేదంటూ చంటి సంచలన వ్యాఖ్యలు చేశారు.తాను జబర్దస్త్ షోకు రాకముందే సినిమాలలో నటించానని చంటి చెప్పుకొచ్చారు.జబర్దస్త్ కు ముందు నేను 20 సినిమాలలో నటించానని డైరెక్ట్ గా జబర్దస్త్ షోలో చేసిన వాళ్లకు జబర్దస్త్ ద్వారా గుర్తింపు వచ్చి ఉండవచ్చని చంటి తెలిపారు.

సినిమా సీన్ కు, స్కిట్ కు డిఫరెన్స్ ఉంటుందని దర్శకుడు చెప్పిన పాయింట్ నాకు అర్థం కావడంతో పాటు సీన్లకు సంబంధించి నా ఆలోచనలను కూడా పంచుకుంటానని చంటి చెప్పుకొచ్చారు.

Telugu Chalaki Chanti, Chalakichanti, Jabardasth Show-Movie

జబర్దస్త్ షో నుంచి నేను మూడుసార్లు బయటకు వచ్చానని అయితే జబర్దస్త్ వాళ్లకు నాపై గౌరవం ఉందని చలాకి చంటి తెలిపారు.నేను శ్యామ్ ప్రసాద్ రెడ్డికి చెప్పి బయటకు వెళ్లానని చలాకి చంటి కామెంట్లు చేశారు.

వ్యక్తిగత కారణాల వల్ల, యూఎస్ షెడ్యూల్ వల్ల కూడా తాను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చానని చంటి చెప్పుకొచ్చారు.బిగ్ బాస్ నిర్వాహకులు చంటికి భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని సమాచారం అందుతోంది.

బిగ్ బాస్ షో చంటికి ప్లస్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube