పవన్ కళ్యాణ్( pawan kalyan ) అభిమానులతో పాటు అంతా కూడా చాలా ఆసక్తి గా ఎదురు చూస్తున్న సినిమా బ్రో.( Bro movie ) ఈ సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ వినోదయ్య సీతమ్ కి రీమేక్ అనే విషయం తెల్సిందే.
ఒరిజినల్ వర్షన్ కి దర్శకత్వం వహించిన సముద్ర ఖని ఈ సినిమా కు దర్శకత్వం వహిస్తున్నాడు.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా విడుదల తేదీ సమీపిస్తోంది.

వచ్చే వారంలో విడుదల కాబోతున్న ఈ సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యం లో భారీ ఎత్తున విడుదల కు ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ వేడుక లో పవన్ కళ్యాణ్ పాల్గొంటాడు అంటున్నారు.ఆ విషయాన్ని పక్కన పెడితే తాజాగా ఈ సినిమా యొక్క రన్ టైమ్ గురించి ప్రచారం జరుగుతోంది.సినిమా రన్ టైన్ ను గురించి మీడియా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం 130 నిమిషాలు మాత్రమే ఉండబోతుందట.
అంటే రెండు గంటల 10 నిమిషాలు మాత్రమే ఈ సినిమా ఉంటుందని.పెద్ద హీరోల సినిమా లు రెండున్నర గంటలు లేదా రెండు గంటల నలబై నిమిషాలు మినిమంగా ఉంటున్నాయి.
అలాంటిది రెండు గంటల పది నిమిషాలు మాత్రమే ఉంటే పవన్ ను ఎంత వరకు చూస్తాం అని చాలా మంది ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియా లో పవన్ అభిమానులు బ్రో రన్ టైమ్ పై విమర్శలు చేస్తున్నారు.పవన్ మరియు సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej )ఉన్న సమయంలో ఇద్దరు హీరోలకు ప్రాముఖ్యత కల్పిస్తే ఎక్కువ రన్ టైమ్ ఉంచితే బాగుండేది అంటూ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియా ద్వారా ఈ విషయమై యూనిట్ సభ్యులు ఏమైనా క్లారిటీ ఇస్తారా అనేది చూడాలి.
ప్రస్తుతానికి సినిమా ప్రమోషన్ కార్యక్రమాల హడావుడి కొనసాగుతోంది.సాయి ధరమ్ తేజ్.
కేతిక శర్మ లు ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.అవి త్వరలో రాబోతున్నాయి.
ఇక బ్రో ప్రమోషన్ ఈవెంట్ లో పవన్ పాల్గొనబోతున్నాడు.ఎంత చేసినా పవన్ తక్కువ సమయం కనిపిస్తాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యం లో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.