Bro Movie: ఆ స్పెషల్ డే రోజు ఓటీటీ లోకి రాబోతున్న బ్రో మూవీ.. ఎప్పుడో తెలుసా?

సముద్రఖని దర్శకత్వంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,( Pawan Kalyan ) యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) కలిసి నటించిన తాజా చిత్రం బ్రో.( Bro ) ఈ సినిమా తాజాగా విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే.

 Pawan Kalyan Bro Movie Ott Streaming Details-TeluguStop.com

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది.తాజాగా విడుదలైన ఈ సినిమాతో చాలాకాలం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది.

వర్షాలు పడుతున్నా కూడా థియేటర్ల వద్ద అభిమానుల సందడి తగ్గడం లేదు.ప్రీమియర్ షోస్ నుండే పాజిటివ్ టాక్ దక్కించుకున్న ఈ మూవీకి ఏపీ, తెలంగాణలో హౌస్‌ఫుల్స్ పడుతున్నాయి.

Telugu Bro, Bro Ott, Bro Avatar, Netflix, Ott Fix, Ott, Pawan Kalyan, Sai Dharam

ఇన్ని రోజులు ఫ్యాన్స్, ఆడియన్స్ పవన్ నుండి మిస్ అయిన ఎంటర్‌టైన్‌మెంట్, స్టైల్, స్వాగ్, వింటేజ్ లుక్స్ అలాగే పవర్ స్టార్ ఓల్డ్ బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ అన్నీ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నాయి.సెలబ్రిటీలు కూడా పనులు పక్కన పెట్టేసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడ్డానికి మల్టీప్లెక్సుల బాట పట్టారు.అయితే పవన్ లాంటి స్టార్ హీరో మూవీ సింగిల్ స్క్రీన్‌లో చూస్తే ఆ కిక్కే వేరు.అభిమానుల కోలాహలం మధ్య, క్లాప్స్, విజిల్స్ వంటి ఆ హంగామా మధ్య సినిమా అర్థం కాకపోయినా కానీ ఆ అనుభూతి వేరేలా ఉంటుంది.

ఇది ఇలా ఉంటే ఒకవైపు ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసకుపోతుండగా మరొకవైపు సోషల్ మీడియాలో ఈ సినిమా ఓటీటీ( OTT ) డేట్ పై అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Bro, Bro Ott, Bro Avatar, Netflix, Ott Fix, Ott, Pawan Kalyan, Sai Dharam

బ్రో మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ( Netflix ) దక్కించుకుంది.పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.ఈ లెక్కన థియేటర్లలో విడుదలైన 5 వారాల తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి రానుంది.

అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.శాటిలైట్ రైట్స్ జీ తెలుగు భారీ ధరకు కొనుగోలు చేసింది.

అయితే ఈ విషయాలపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.మరొకవైపు మూవీ మేకర్స్ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube