రాజ్యసభకు నలుగురు ప్రముఖులు..మోడీని అభినందించిన పవన్..

రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నలుగురు ప్రముఖులను కేంద్రం నామినేట్​ చేసింది.ప్రముఖ రచయిత వి.

 Pawan Kalyan Appreciates Prime Minister Modi For Promoting Four Members To Rajya-TeluguStop.com

విజయేంద్రప్రసాద్‌, సంగీత దర్శకుడు ఇళయరాజ, పరుగుల రాణి పి.టి.ఉష, వీరేంద్ర హెగ్డే ఆ జాబితాలో ఉన్నారు.ఆయా రంగాలో విశేష కృషిని గుర్తిస్తూ.

కేంద్ర ప్రభుత్వం వీరిని ఎంపిక చేసింది.

రాజ్యసభకు నాలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు ప్రముఖులను రాష్ట్రపతి కోటా కింద నామినేట్ చేయడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు.

జనసేన తరఫున వారికి శుభాకాంక్షలు తెలిపారు.వారి ఎంపికలో చొరవ చూపినందుకు ప్రధాని నరేంద్రమోదీని పవన్ కళ్యాణ్ అభినందించారు.

దేశ ప్రతిష్ఠను ప్రపంచానికి చాటినవారిని ఎంపిక చేశారంటూ ప్రధానిని పవన్ కళ్యాణ్ కొనియాడారు.ఈ రోజుల్లో ఎవరికి పదవులిస్తే రాజకీయంగా ఎంత లాభం వస్తుంది.? ఎన్ని కోట్లు తమ ఇళ్లకు చేరుతాయని కొన్ని పార్టీల అధినేతలు లెక్కలు వేస్తున్న సమయంలో… పెద్దల సభకు ఆయా రంగాలలోని ప్రతిభావంతులను ఎంపిక చేయడం అభినందనీయమని జనసేన తరఫున ట్విట్టర్ లో పేర్కొన్నారు.తెలుగుతోపాటు హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో పవన్ కళ్యాణ్ సంతకంతో లేఖల్ని విడుదల చేశారు.

Telugu Appreciates, Janasena, Pawan Kalyan, Prime Modi, Pt Usha, Rajyasabha-Poli

నాలుగు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నలుగురు ప్రముఖులను రాజ్యసభకు పంపిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.కేరళ నుంచి ప్రముఖ అథ్లెట్‌ పీటీ ఉష, తమిళనాడు నుంచి ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా, కర్ణాటక నుంచి ధర్మస్థల ఆలయ పాలక మండలి అధినేత, సామాజిక సేవకుడు వీరేంద్ర హెగ్గడే, ఆంధ్రప్రదేశ్‌ నుంచి సినీ కథా రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్‌ను పార్లమెంట్‌ ఎగువసభకు నామినేట్‌ చేసింది… వీరిని ఎంపిక చేయడం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు.ప్రధాని నరేంద్రమోదీని పవన్ కళ్యాణ్ అభినందించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube