పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రం తర్వాత దాదాపుగా రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాడు.ఆ సినిమా విడుదలైన తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ మళ్లీ రెండేళ్ల తర్వాత ఒకేసారి మూడు ప్రాజెక్ట్‌లను ప్రకటించాడు.
మొదటగా బాలీవుడ్ హిట్ మూవీ పింక్.వకీల్ సాబ్ టైటిల్‌తో ఈ చిత్రం రీమేక్ అవుతోంది.
ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాను హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాను పవన్ చేసేందుకు కమిట్ అయ్యాడు.ఇప్పుడు మరో సినిమాకు కూడా ఆయన ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
రామ్ తాళ్లూరి అంటే పవన్ కు ప్రత్యేకమైన అభిమానం.వీరిద్దరి కాంబోలో ఒక సినిమా ఎప్పుడో రావాల్సి ఉండే.కాని కొన్ని కారణాల వల్ల వర్కౌట్ కాలేదు.ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
డాలీ దర్శకత్వంలో ఒక రీమేక్‌ను రామ్ తాళ్లూరి బ్యానర్‌లో పవన్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.అది రామ్ తాళ్లూరి స్వయంగా పవన్ బర్త్‌డే సందర్బంగా వచ్చే నెల 2వ తారీకున ప్రకటించే అవకాశం ఉంది అంటున్నారు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్స్‌కు హాజరు అవ్వడం లేదు.వచ్చే ఏడాది ఆరంభం వరకు పవన్ షూటింగ్స్‌ను పోస్ట్ పోన్ చేస్తూ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.కనుక ఈ నాల్గవ సినిమా వచ్చే ఏడాదిలో ప్రారంభం అయ్యేది అనుమానమే అంటున్నారు.వచ్చే ఏడాదిలో వకీల్ సాబ్ మరియు క్రిష్ మూవీ పూర్తి చేసి 2022 లో హరీష్ శంకర్ మరియు రామ్ తాళ్లూరి సినిమాలు పవన్ చేస్తాడని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.