గత రెండు సంవత్సరాలుగా అధికార పార్టీని ఏ విషయంలో ప్రశ్నించినా కూడా ముఖ్యమంత్రి పదవికి గౌరవం తగ్గకుండా వ్యవహరించిన పవన్, గత కొన్ని రోజులుగా సూటిగా జగన్ టార్గెట్ గానే విమర్శలు చేస్తున్నారు.ఏలూరు సభ సాక్షిగా ఇకపై ఏకవచనంతోనే ముఖ్యమంత్రి పిలుస్తానని చెప్పిన పవన్( Pawan kalyan ) ఇక అప్పటినుంచి జగన్ పై మాస్ ర్యాగింగ్ చేస్తున్నారనే చెప్పాలి.
ఆయన హవ భావాలను అనేక సందర్భాల్లో ఇమిటేట్ చేసిన పవన్ , ముఖ్యమంత్రి వ్యవహార శైలిని తూర్పుర పడుతూ చెలరేగిపోతున్నారు.ఏలూరు సభలో శాంపిల్ చూపించిన పవన్ తాడేపల్లిగూడెం సభతో జగన్ పై వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేశారు .

ముఖ్యమంత్రి సతీమణి భారతి( Y S Bharati) గారిని ఉద్దేశించి ఈయనకు కొంత సంస్కారం నేర్పించవమ్మా చేతులెత్తే మొక్కుతా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి తండ్రి లేని బిడ్డ నని చెప్పుకుంటున్నాడని, అసలు మరణం లేని ఇల్లు ఉంటుందా అని ప్రశ్నించారు .ప్రజల్లోనే తిరుగుతున్నాడని అందరూ కలిసి తనను టార్గెట్ చేస్తున్నారని సానుభూతి కోరుతున్నాడని దయ తలచి ప్రజలు ఒక అవకాశం ఇస్తే లక్ష కోట్లు వేసేసాడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు జనసైనికుల నుంచి భారీ స్పందన కనిపించింది.

అంతేకాకుండా సూపర్ స్టార్ కృష్ణ చనిపోయినప్పుడు మహేష్ బాబు( Mahesh babu ) పుట్టెడు బాధలో ఉంటే అక్కడికి వెళ్లి కూడా నవ్వుతున్న ఈయనను ఎలా అర్థం చేసుకోవాలంటూ పవన్ ప్రశ్నించారు ఆయన ఫిజికల్ గా ప్రజెంట్ అయినా మనసు మాత్రం అక్కడ ఉండదని ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో జగన్కు తెలియదంటూ తీవ్ర విమర్శలు చేశారు.వాలంటీర్ వ్యవస్థతో ధర్నాలు చేయిస్తే తాను లొంగనని మీరు 10 అడుగులు వేస్తే నేను 100 అడుగులు వేస్తానన్న సంకేతాలు ఇవ్వడం కోసమే తాడేపల్లిగూడెం వేదికగా పవన్ తన విమర్శలు డోస్ పెంచారని విశ్లేషణలు వస్తున్నాయి .ఏది ఏమైనా ఈ రాజకీయ పోరాటంలో ముందుకే తప్ప వెనకడుగు వేయడం కుదరదని విజయమో వీర స్వర్గమో తేల్చుకోవాలని జనసేన నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది
.






