జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.కాపు సామాజికవర్గానికి పవన్ కల్యాణ్ చేసిందేమీ లేదని తెలిపారు.
కాపులు పవన్ కల్యాణ్ కు దూరం కాబోతున్నారని నారాయణ స్వామి వెల్లడించారు.పవన్ తన కులాన్ని చంద్రబాబుకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
అనంతరం తెలంగాణలో జనసేన పోటీపై మాట్లాడిన ఆయన తెలంగాణలో జనసేన ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాలేదని విమర్శించారు.నోటా కన్న తక్కువ ఓట్లు జనసేనకు వచ్చాయని తెలిపారు.
ఏపీలో కూడా జనసేనకు ఇదే పరిస్థితి అని స్పష్టం చేశారు.