జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) వ్యాఖ్యలపై కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్పందించారు.ప్రజలకు దూరంగా ఉండటం కోసమే పవన్ కల్యాణ్ బ్లేడ్ బ్యాచ్ దాడి వ్యాఖ్యలని తెలిపారు.
తన వ్యక్తిగత భద్రత కోసం పవన్ కల్యాణ్ రెండు వందల మంది సెక్యూరిటీని పెట్టుకున్నారని పేర్కొన్నారు.ఆయన ప్రజలను ముట్టుకోరు.
చెమట పట్టకూడదని విమర్శించారు.
ఈ క్రమంలోనే ప్రజల దగ్గరకు రాలేనప్పుడు పవన్ కు రాజకీయాలు ఎందుకని ముద్రగడ( Mudragada Padmanabham ) ప్రశ్నించారు.చేతకాని వారే ఇలాంటి మాటలు మాట్లాడతారన్న ముద్రగడ జనసేనాని పవన్ స్థాయికి ఇటువంటి వ్యాఖ్యలు సరికాదని తెలిపారు.