పవర్ స్టార్ ది భయమా!! లేక అభిమానమా!!!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటేనే అభిమానులకు దైవం కన్నా ఎక్కువ.ఆయన తెరపై కనిపించినా.

 Pawan Back Step On Gopala Gopala Release-TeluguStop.com

రాజకీయ కురుక్షేత్రంలో గర్జించినా.సమాజ సేవలో మెరిసినా అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు.

అయితే ఇక గట్స్ విషయంలో, దూకుడు విషయంలో ఆయనకు మరే హీరో సరిపోడు అన్నది అభిమానులు ఘంటాపదంగా చెప్పే మాట.అలాంటి పవన్ కల్యాణ్ భయపడ్డాడా?? అన్న పుకారు టాలీవుడ్ లో షికార్లు కొడుతుంది.

విషయం ఏమిటంటే పవన్-వెంకీ కలసి నటిస్తున్న “గోపాల-గోపాల” చిత్రం జనవరిలో సంక్రాంతి కానుకగా 14న విడుదల కావాల్సి ఉంది.అయితే అదే రోజున విక్రమ్-శంకర్ “ఐ” సైతం విడుదల కానుంది అని అఫీషియల్ టాక్ రావడంతో ఆలోచనలో పడ్డ పవన్ అండ్ పార్టీ తమ సినిమాను ఒక వారం ముందుగానే అంటే జనవరి 9నే విడుదల చేసేస్తే పోతుంది అని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.

అయితే ఈ మార్పుకు కారణం మానవతా దృక్పధమే తప్ప భయమేమీ కాదు అని.రెండు భారీ సినిమాలు ఒకే సారి విడుదల అయితే పరిశ్రమకే ఇబ్బంది అని, అంతేకాకుండా థియేటర్స్ ఇబ్బందులు సైతం నెలకొంటాయి అని అందుకే పవన్ ఇలా ముందు చూపుతో ఆలోచించి ముందుగానే ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేసాడని అభిమానుల టాక్.

ఏది ఏమైనా అన్ని సినిమాలు హిట్ అయితేనే కదా ఇండస్ట్రీ కి మంచి పరిణామం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube