టాలీవుడ్ మొదలు కొని.బాలీవుడ్ వరకు ఎక్కువమంది సెలెబ్రెటీస్ కు మధ్యం సేవించే అలవాటు ఎక్కువగా ఉంటుంది.
అక్కడక్కడా ఆరా కొరా ఆర్టిస్ట్స్ తప్పితే దాదాపుగా అందరూ ఆ అలవాటుకు అలవాటు పడిన వారే.అయితే ఈ పరిస్తితి బీ-టౌన్ లో అయితే మరింత ఎక్కువ అనే చెప్పుకోవాలి.
కొందరు హీరోలు సెట్స్ కు తాగి రావడం వీరంగం చెయ్యడం సహజమే.అలాంటి సంఘటనే మరో సారి రిపీట్ అయింది.
సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న తన తరువాతి చిత్రం యొక్క షూటింగ్ శేరవేగంగా సాగుతుంది.ఇక ఈ షూటింగ్ లో కొన్ని సీన్స్ ను స్లమ్ ఏరియా లో షూట్ చేయాల్సి ఉండగా ఆ కోవలో షూటింగ్ ఏర్పాట్లు చేసుకుంది చిత్ర యూనిట్.
ఇక ఆ షూటింగ్ కు ఈ చిత్రంలో నటిస్తున్న “నిషా” అనే ఒక ఆర్టిస్ట్ ఫుల్ గా తాగేసి వచ్చి వీరంగం సృస్టించడంతో సినిమా షూటింగ్ కు ప్యాక్ అప్ చెప్పేశారు.అయితే ఈ విషయం సల్మాన్ ఖాన్ వరకు వెళ్ళినా ఆయన పెద్దగా పట్టించుకుని స్పందించలేదు అని తెలుస్తుంది.
ఇక ఆ భామ మత్తు వదిలిన తరువాత దర్శక నిర్మాతలకు “సారి” చెప్పి ముందు రోజు రాత్రి కొంచెం ఎక్కువగా మధ్యం సేవించడం ఇలా జరిగింది అని మరో సారి జరగకుండా చూసుకుంటాను అని తెలుపడంతో కధ సుఖాంతం అయ్యింది.







