మెగా ఫ్యామిలీ అంటేనే టాలీవుడ్ లో ఒక చరిత్ర.ఇప్పటికే ఆ ఫ్యామిలీ నుంచి ఎందరో హీరోలు తెలుగు సినీ పరిశ్రమని శాసించాలి అని తమ ప్రయత్నాలు తాము చేసుకుంటూ మంచి మంచి సినిమాలతో ముందుకు పోతున్నారు.
అయితే అలాంటి కోవలోనే నిన్న “ముకుంద”గా మన ముందుకు వచ్చాడు నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్.
సాధారణంగా మెగా ఫ్యామిలీకి మాస్ ఫాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ.
ఇక ఆ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న హీరోలు సైతం మాస్ సినిమాతోనే తెరంగేట్రం చెయ్యాలి అన్న ఆలోచనతో ఉంటారు.అలా అనుకునే మంచి కమర్షియల్ డైరెక్టర్ తో మాస్ మూవీ చేద్దాం అని అనుకుని, తన ఇంట్రొడక్షన్ మూవీ కోసం ఎన్నో కలలు కన్న వరుణ్ కు చిరు సలహా ఇబ్బందులను తెచ్చిపెట్టింది.
మాస్ కధలు వింటున్న క్రమంలో చిరు మంచి ఫ్యామిలీ ఎంటర్‌టేనర్ తో ఎంట్రీ ఇస్తే బావుంటుంది అని, అంతేకాకుండా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలను సైతం తానే రికమండ్ చేసి మరీ వరుణ్ ను ఫ్యామిలీ మూవీ తో లాంచ్ అయ్యేలా చూసాడు.
అయితే ఎన్నో అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ చిత్రం అనుకున్నంత మంచి ఫలితాన్ని ఇచ్చినట్లు లేదు అన్నది సాక్షాత్తూ అభిమానులు చెబుతున్న మాట.సినిమా కొంచెం స్లో.గా సాగదీస్తు.
బోరింగ్ గా అనిపించడం, కొత్తదనం కోసం చేసిన ప్రయత్నం కాస్తా రౌంటిన్ గా మారడంతో వరుణ్ తేజ్ తన ఎంట్రీ పై పెట్టుకున్న ఆశలకు చిరు నీళ్ళు చల్ళినట్లు అయ్యింది.ఏది ఏమైనా మంచి సినిమాలను, టాలెంట్ ఉన్న హీరోలను మన తెలుగు ప్రజలు ఎప్పుడు ఆదరిస్తారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.







