యువగళం ముగింపు సభకు పవన్ దూరం ! లోకేష్ హ్యాపీనా ? 

ఏపీలో పొత్తు కొనసాగిస్తున్న టిడిపి జనసేన పార్టీలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లేందుకు నిర్ణయించుకోవడంతో పాటు,  ఉమ్మడిగా భారీ బహిరంగ సభలు,  రోడ్డు షోలు నిర్వహించాలని ఇప్పటికీ కీలక నిర్ణయం తీసుకున్నారు.దీనిలో భాగంగానే మొదటగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర సభతోనే దానిని మొదలు పెట్టాలని నిర్ణయించారు.

 Pawan Away From Yuvagalam Final Meeting! Is Lokesh Happy, Tdp, Janasena, Nara L-TeluguStop.com

వాస్తవంగా ఈనెల 17వ తేదీన యువ గళం పాదయాత్ర( Yuva Galam Padayatra ) ముగింపు సభ  జరగాల్సి ఉంది.అయితే తుఫాను కారణంగా పాదయాత్రకు మూడు రోజులపాటు విరామం ఇవ్వడంతో,  20వ తేదీన ఈ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Telugu Ap, Janasena, Janasenani, Pavan Kalyan, Tdptelugudesham, Telugudesam, Ysr

ఈ సభకు భారీగా  టిడిపి కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉండడంతో,  ఏడు ప్రత్యేక రైళ్లతో పాటు,  భారీగా వాహనాలను ఏర్పాటు చేశారు.20వ తేదీన యువ గళం పాదయాత్ర ముగింపు సభను భారీగా నిర్వహించేందుకు టిడిపి ఏర్పాట్లు చేస్తుంది.అయితే ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కావడం లేదని టిడిపి వర్గాలు పేర్కొంటున్నాయి.  ముందస్తు కార్యక్రమాల ఉండడం వల్లనే పవన్ ఈ సభకు రావడంలేదని రెండు పార్టీల నాయకులు చెబుతున్నారు.

అయితే యువ గళం ముగింపు సభ లో లోకేష్ ను మాత్రమే హైలెట్ చేసే విధంగా ఉంటే మంచిదని ఉద్దేశంతో టిడిపి ఉందట.  పవన్( Pawan away ) ఈ సభకు హాజరైతే అందరి దృష్టి పవన్ వైపే ఉంటుంది.

అనుకున్న స్థాయి లోకేష్ కు క్రెడిట్ రాదనే ఆలోచన టిడిపి అగ్రనేతల్లోనూ ఉంది.ఇప్పుడు పవన్ ఈ సభకు రాకపోవడంతో లోకోష్ కూడా హ్యాపీగా ఉన్నారట.పవన్ ఈ సభకు హాజరు కాకపోవడం వల్ల తానే హైలెట్ అవుతానని ,ఈ సభకు హాజరైన నాయకులంతా తనని హైలెట్ చేస్తారని లోకేష్ భావిస్తున్నారట.

Telugu Ap, Janasena, Janasenani, Pavan Kalyan, Tdptelugudesham, Telugudesam, Ysr

ఈ సభ ముగిసిన తర్వాత నియోజకవర్గాల వారీగా టిడిపి జనసేన లు కలిసి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఇక వరుసగా జరగబోయే ఈ సభలు,  సమావేశాలకి పవన్ తో పాటు చంద్రబాబు( Chandrababu naidu ) సైతం హాజరవుతారని ఇక వైసిపి ప్రభుత్వం ను పూర్తిస్థాయిలో టార్గెట్ చేసుకుని ఎన్నికలే లక్ష్యంగా పవన్ చంద్రబాబు ఎన్నికల ముగిసే వరకు జనాల్లోనే ఉంటారని టిడిపి కీలక నాయకులు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube