టీడీపీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లడంతో సింపతీ కోసమే జనసేనాని పవన్ కల్యాణ్ పొత్తులు పెట్టుకుంటున్నారని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
గతంలోనూ పవన్ వారాహి విజయ యాత్ర జరిగిందన్న వైవీ సుబ్బారెడ్డి ఆ సమయంలో పొత్తులు బయటపడలేదని తెలిపారు.
తప్పు చేసిన వ్యక్తికి ఏ విధంగా సపోర్ట్ చేస్తారని పవన్ ను ఆయన ప్రశ్నించారు.చంద్రబాబు విషయంలో కోర్టులు సరైన నిర్ణయాన్ని ప్రకటించాయని పేర్కొన్నారు.
చట్టం అందరికీ సమానమేనన్న వైవీ సుబ్బారెడ్డి తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు.