నరేష్ నా పార్ట్నర్ మాత్రమే కాదు.... సంచలన వ్యాఖ్యలు చేసిన నటి పవిత్ర లోకేష్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి ఎంతోమంచి గుర్తింపు సంపాదించుకున్న పవిత్ర లోకేష్ (Pavitra Lokesh) తన వ్యక్తిగత కారణాల వల్ల పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.ఈమే నటుడు నరేష్(Naresh) తో కలిసి రిలేషన్ లో ఉంటున్న విషయం మనకు తెలిసిందే.

 Pavitra Lokesh Shocking Comments About Relationship With Naresh Details,pavitra-TeluguStop.com

ఓ సినిమా షూటింగ్లో భాగంగా వీరిద్దరూ కలిసి నటించారు అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడటం ఆ పరిచయం ప్రేమగా మారడం జరిగింది.ఇలా ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉండడంతో ఇద్దరు కలిసి రిలేషన్ లో ఉంటున్నారు.

ఇక నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు కూడా మళ్ళీ పెళ్లి(Malli pelli) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమా మే 26వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి పవిత్ర లోకేష్ ఈ సినిమా గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు.అలాగే నరేష్ తో తనకు ఉన్నటువంటి రిలేషన్ గురించి కూడా ఈమె క్లారిటీ ఇచ్చారు.

ఈ సందర్భంగా పవిత్ర మాట్లాడుతూ నరేష్ తనకు పార్ట్నర్ మాత్రమే కాదని తనకు సపోర్ట్ సిస్టం కూడా అంటూ కామెంట్స్ చేశారు.ఆయన ప్రతి విషయంలో తనకు ఎంతో అండగా నిలబడ్డారని,ప్రతి విషయంలోనూ తన సపోర్ట్ నాకు చాలా అందిస్తున్నారని తెలియజేశారు.ఇక నా గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ ఎదురయ్యాయి అయితే ఈ వార్తలు వచ్చినప్పుడు తనకు చాలా బాధ కలిగిందని ఆ సమయంలో నరేష్ చాలా అండగా నిలచారు అంటూ ఈ సందర్భంగా పవిత్ర చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube