వకీల్ సాబ్ ఫోటోలు లీక్.. 'యంగ్ లుక్'లో పవన్ కళ్యాణ్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

ఇటు రాజకీయాల్లోనూ అటు సినిమాల్లోను తన క్రేజ్ మామూలుది కాదు.రాజకీయాల్లో ఎదగాలని స్టార్ హీరోను చేసిన సినిమాలను సైతం దూరం పెట్టాడు.

అజ్ఞాతవాసి చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ ఒక్క సినిమాలో లేడు.అలాంటిది ఇప్పుడు వకీల్ సాబ్ సినిమాతో మల్లి ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నాడు.

ఈ చిత్రాన్ని దిల్ రాజు బోణి కపూర్ కలిసి తీస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫోటో ఏ ఒక్కటి బయటకు వచ్చినా కేసు వేస్తాం అంటూ ప్రచారం కూడా చేశారు.

Advertisement

ఎందుకంటే ఎంతోకాలం తర్వాత వస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా.ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది.

అనే భారీ అంచనాలు పెట్టుకున్నారు.అయితే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఫోటోలు ఎప్పటికప్పుడు లీక్ చేస్తూనే వస్తున్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే మరో ఫోటో లీక్ అవ్వడం.అది కాస్త యంగ్ లుక్ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఈ యంగ్ లుక్ కోసం పవన్ కళ్యాణ్ బరువు తగ్గారు.ప్రత్యేకమైన డైట్ తో త్వరగా బరువు తగ్గి ప్రస్తుతం షూటింగ్ లో పాల్గొన్నారు.ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కోసం హైదరాబాద్ లోని నిజాం కళాశాలలో షూటింగ్ చేస్తున్నారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఇక ఆ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు చూసేందుకు అక్కడికి వచ్చారు.అక్కడ పవన్ కళ్యాణ్ ఫోటోలు తీశారు ఇంటర్నెట్ లో పెట్టారు.దీంతో అవి వైరల్ అయ్యాయి.

Advertisement

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటుగా నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తాజా వార్తలు